IND vs SL : బెంగళూరు వేదికగా జరుగుతున్న పింక్ బాల్ రెండో టెస్టులో భారత జట్టు (IND vs SL )ఘన విజయాన్ని నమోదు చేసింది. మూడో రోజు ఆటలో భాగంగా 238 పరుగుల తేడాతో గెలుపొందింది.
దీంతో రెండు టెస్టు మ్యాచ్ ల సీరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ తర్వాత నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మకు ఇది చిరస్మరణీయమైన విజయంగా పేర్కొనవచ్చు.
భారత బౌలర్లు బుమ్రా, షమీ, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కీలకంగా వ్యవహరించారు. రిషంబ్ పంత్ , శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ లో రాణించారు.
అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను సత్తా చాటింది భారత జట్టు. ఆట ప్రారంభం అయ్యాక కుసాల్ మెండీస్ , కెప్టెన్ దిముత్ కరుణ రత్నే పునః ప్రారంభించారు. వీరిద్దరి జోడీని అశ్విన్ విడదీశాడు.
మాథ్యూస్ ను జడేజా వెనక్కి పంపించాడు. ధనంజయ డిసిల్వాను నాలుగు పరుగులకే బోల్తా కొట్టించాడు తన బంతితో రవిచంద్రన్. ఇక కెప్టెన్ కరుణ రత్నే భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు.
నిరోషన్ డిక్వెల్లాతో కలిసి జట్టును 151 రన్స్ దాకా తీసుకు వెళ్లారు. అక్షర్ పటేల్ అసలంక వికెట్ తీశాడు. కరుణ రత్నే అద్భుతంగా ఆడాడు 107 పరుగులు చేశాడు. బుమ్రా బోల్తా కొట్టించాడు.
లక్మల్ ను ఒక పరుగు వద్ద అవుట్ చేయడంతో లంక పని పూర్తయింది. 208 పరుగుల వద్ద శ్రీలంక ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
Also Read : ‘అమేలియా’కు ఐసీసీ అవార్డు