INDW vs BANW : హమ్మయ్య ఎట్టకేలకు (Indian women’s team) భారత మహిళల జట్టు సత్తా చాటింది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళా వన్డే వరల్డ్ కప్ 2022 (World Cup 2022) లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో బంగ్లా దేశ్(INDW vs BANW) పై విజయం సాధించింది.
సెమీ ఫైనల్ ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఏకంగా భారత జట్టు 110 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 229 పరుగుల టార్గెట్ ముందుంచింది.
దీంతో 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా దేశ్ జట్టు భారత (INDW vs BANW)బౌలర్ల ధాటికి 119 పరుగులకే చాప చుట్టేసింది. ఇండియన్ బౌలర్లలో స్నేహ్ రానా నాలుగు వికెట్లు పడగొట్టింది.
దీంతో వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. రానాతో పాటు ఝులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీసి బంగ్లాదేశ్ కు ముప్పు తిప్పలు పెట్టారు. ఇక బంగ్లాదేశ్ బ్యాటర్ లు పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు.
బంగ్లా బ్యాటర్లలో సల్మా ఖతూన్ 32 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. అంతకు ముందు హైదరాబాదీ స్టార్ మిథాలీ రాజ్ సారథ్యంలో ని భారత జట్టు మొదట బ్యాటంగ్ చేసింది.
నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 229 రన్స్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన 30 పరుగులు చేస్తే షఫాలీ వర్మ 42 రన్స్ తో రాణించారు.
ఆఖరులో వచ్చిన యాస్తికా భాటియా హాఫ్ సెంచరీతో దుమ్ము రేపింది. ఈ ముగ్గురు ఆడడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ విక్టరీతో భారత జట్టు సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.
Also Read : అతడితో ఆడేందుకు వేచి చూస్తున్నా