Indian Air Force: లద్ధాఖ్ లో అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ !
లద్ధాఖ్ లో అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ !
Indian Air Force: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force)లద్ధాఖ్ లో నిర్వహిస్తున్న యుద్ధ శిక్షణలో అపశ్రుతి చోటుచేసుకొంది. భారత వాయుసేన కు చెందిన అటాక్ హెలికాప్టర్ అపాచీ దెబ్బతింది. దీనితో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సివచ్చింది. కఠిన భౌగోళిక పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకొందని ఐఏఎఫ్ తెలిపింది. దీనిలో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాప్టర్‌ను సమీపంలోని వాయుసేన స్థావరానికి చేర్చారు. ఈ ఘటనకు గల కారణాలను కనుగొనేందుకు భారత వాయుసేన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చేపట్టింది.
Indian Air Force…
గతేడాది మేలో కూడా ఈ రకానికి చెందిన హెలికాప్టర్ మధ్యప్రదేశ్‌లోని భింద్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పట్లో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పైలట్లు దీనిని అక్కడి పొలాల్లో అత్యవసరంగా దించేశారు. 2020లో కూడా హోషియార్‌పుర్‌లో ఒక హెలికాప్టర్ ఇలానే ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే అత్యుత్తమ అటాక్ హెలికాప్టర్ గా అపాచీ పేరు తెచ్చుకొంది. వీటి కొనుగోలుకు 2015లో భారత్, అమెరికాతో ఒప్పందం చేసుకొంది. ఈ డీల్ విలువ రూ.13,952 కోట్లు. మొత్తం 22 అత్యాధునిక అపాచీలు మన దళాల చేతికి వచ్చాయి. తాజాగా ఆర్మీ కూడా ఆరు అపాచీలను కొనడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం 2020లో రూ.5,691 కోట్లు విలువైన ఒప్పందాన్ని చేసుకొంది. ఈ హెలికాప్టర్లను ఎగిరే యుద్ధ ట్యాంకులుగా నిపుణులు అభివర్ణిస్తారు.
Also Read : DC vs KKR IPL 2024 : 106 పరుగుల తేడాతో ఢిల్లీ పై ఘన విజయం సాధించిన కోల్‌కతా