Kangana Ranaut: రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు !

రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు !

Kangana Ranaut: కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని ఉద్దేశించి… బాలీవుడ్ ప్రముఖ నటి, మండి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లి సోనియా గాంధీ ఆకాంక్షలకు రాహుల్‌ బాధితుడయ్యారని ఆమె ఆరోపించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈవిధంగా స్పందించారు. ‘3 ఇడియట్స్ సినిమాలో చూసినట్లు… కుటుంబసభ్యుల వల్ల పిల్లలు ఇబ్బందిపడుతుంటారు. రాహుల్‌ ది కూడా ఇదే పరిస్థితి. ఒత్తిడి లేకుండా వారి ఇష్టాలకు తగ్గట్టుగా సొంతంగా జీవించేందుకు రాహుల్, ప్రియాంకకు స్వేచ్ఛ ఉండాలి. ఆయన నటనలో ప్రయత్నించి ఉంటే.. మంచి నటుడు అయ్యుండేవారు’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Kangana Ranaut Comment

రాహుల్‌ వయసు 50 సంవత్సరాలు దాటినప్పటికీ… ప్రతిసారీ యువ నేతగా రీలాంచ్ అవుతుంటారన్నారు. ఆయన ఒత్తిడికి గురవుతున్నారని, ఒంటరితనంతో బాధ పడుతున్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దీనితో కంగనా(Kangana Ranaut) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు దీనిపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చేందకు సిద్ధపడుతున్నారు.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన కంగనా రనౌత్… సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హిమాచల్ ప్రదేశ్‌ లోని మండి లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ తరఫున ఆమె పోటీ చేయనున్నారు. ప్రధాని మోదీ పాలనపై తరచూ ప్రశంసలు కురిపిస్తుంటారు. తమ గురించి నిరంతరం ఆలోచించే నాయకుడొకరు మోదీ రూపంలో తొలిసారి దొరికినట్లు ప్రస్తుతం మహిళలు భావిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.

Also Read : Indian Air Force: లద్ధాఖ్‌ లో అపాచీ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌ !

Leave A Reply

Your Email Id will not be published!