Dr Vivek Lal : ఎన్నారై వివేక్ లాల్ కు అరుదైన గౌర‌వం

అమెరికాలో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

Dr Vivek Lal :  ప్ర‌వాస భార‌తీయుడు వివేక్ లాల్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. అమెరికాలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వ‌రించింది.

ఒక ర‌కంగా భార‌త దేశానికి ల‌భించిన గౌర‌వంగా భావించ‌వ‌చ్చు. భార‌తీయ సంత‌తికి చెందిన జ‌న‌ర‌ల్ అటామిక్స్ సిఇఓ అయిన వివేక్ లాల్ అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ విత్ గ్రేట్ ఫుల్ రిక‌గ్నిష‌న్ అనే కొటేష‌న్ తో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో స‌త్క‌రించారు.

ఇదిలా ఉండ‌గా అమెరికా లోని కాన్సాస్ లోని విచిత స్టేట్ యూనివ‌ర్శిటీ నుండి ఏరోస్పేస్ ఇంజ‌నీరింగ్ లో పీహెచ్ డి చేసిన వివేక్ లాల్(Dr Vivek Lal) కు అమెరికా కార్ప్స్ , ప్రెసిడెంట్ కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అధికారిక ప్ర‌క‌ట‌న ప్ర‌కారం యునైటెడ్ స్టేట్స్ అధ్య‌క్షుడు వ్య‌క్తిగ‌తంగా సంత‌కం చేయ‌డం విశేషం.

కాగా అమెరికా కార్ప్స్ అనేది ప్ర‌భుత్వంలో ఒక భాగం. సంఘాల‌కు సేవ చేసేందుకు అమెరిక‌న్ల‌ను మ‌రింత ద‌గ్గ‌ర చేసే కార్య‌క‌లాపాల‌ను ప్రోత్స‌హించ‌డం సంస్థ ల‌క్ష్యం. డాక్ట‌ర్ వివేక్ లాల్ ఇండ‌స్ట్రీ లీడ‌ర్ , సైంటిఫిక్ క‌మ్యూనిటీ టైటాన్ జ‌న‌ర‌ల్ అటామిక్స్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ గా ప‌ని చేస్తున్నారు.

అణు సాంకేతిక ప‌రిజ్ఞానానికి సంబంధించి ప్ర‌త్యేక రంగాల‌లో కంపెనీ ప్ర‌పంచ అగ్ర‌గామిగా ఉంది. అయితే ప్రిడేట‌ర్ , రీప‌ర్ , గార్డియ‌న్ డ్రోన్ ల వంటి అత్యాధునిక మాన‌వ ర‌హిత వైమానిక విమానాల‌ను అభివృద్ది చేస్తోంది.

భార‌త దౌత్య‌వేత్త కుమారుడైన వివేక్ లాల్(Dr Vivek Lal) గ‌త ఏడాది వాషింగ్ట‌న్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త ప్ర‌ధాన‌మంత్రి మోదీని క‌లిసేందుకు ఆహ్వానించ‌బ‌డిన అతికొద్ది మంది ప్ర‌వాస భార‌తీయుల్లో ఆయ‌న ఒక‌రుగా ఉన్నారు.

Also Read : యువ ర‌చ‌యిత‌ల కోసం ప‌థ‌కం

Leave A Reply

Your Email Id will not be published!