Indian Bowlers Failure : బౌల‌ర్ల నిర్వాకం భార‌త్ కు శాపం

తీరు మార‌ని ఇండియా టీమ్

Indian Bowlers Failure : భార‌త క్రికెట్ జ‌ట్టు ఒక‌సారి బ్యాటింగ్ లో రాణిస్తే మ‌రోసారి బౌలింగ్ లో తేలి పోతోంది. ప్ర‌ధానంగా బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీలో లోపం ఉందా లేక ఆట‌గాళ్ల‌లో ఉందా అనేది తెలియడం లేదు. ఇప్ప‌టికే విరాట్ కోహ్లీ త‌న కెప్టెన్సీకి రిజైన్ చేశాక‌, హెడ్ కోచ్ గా ర‌వి శాస్త్రి త‌ప్పుకున్నాక ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ట్టు కుదురు కోలేదు.

ప్ర‌పంచంలో ఏ దేశ‌మూ చేయ‌న‌న్ని ప్ర‌యోగాలు బీసీసీఐ చేసింది. ఏకంగా ఏడుగురు కెప్టెన్ల‌ను మార్చింది. ప్ర‌స్తుతం క్రికెట్ లో మూడు ఫార్మాట్ లు కొన‌సాగుతున్నాయి. వీటిలో పొట్టి ఫార్మాట్ టి20కి ఎక్కువ ప్ర‌యారిటీ వ‌స్తోంది. వ‌న్డే, టెస్టు మ్యాచ్ ల‌కు ఆద‌ర‌ణ రోజు రోజుకు త‌గ్గి పోతోంది.

ఫ్యాన్స్ కూడా ఫ‌లితం త్వ‌ర‌గా రావాల‌ని కోరుకుంటున్నారు. రాను రాను సంప్ర‌దాయ ఆట క‌నుమ‌రుగ‌య్యే ప్రమాదం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఇందులో భాగంగా బీసీసీఐ మూడు ఫార్మాట్ ల‌కు వేర్వేరుగా ఆటగాళ్ల‌ను ఎంపిక చేసే ప‌నిలో ప‌డింది. దీంతో ఆట‌గాళ్లు ఏ ఫార్మాట్ లో ఉంటామో ఉండ‌మోన‌న్న ఆందోళ‌న‌ల‌తో ఆట‌పై ఫోక‌స్ పెట్ట‌డం లేదు.

ప్ర‌ధానంగా టీమిండియా బౌల‌ర్ల ప‌రంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు బౌల‌ర్లు తేలి పోయారు(Indian Bowlers Failure). సెమీ ఫైన‌ల్ లో ఇంగ్లండ్ చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. క‌నీసం ఒక్క వికెట్ కూడా తీయ‌లేక పోయారు.

ఇక న్యూజిలాండ్ టూర్ లో భాగంగా జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసినా కీవీస్ ను క‌ట్ట‌డి చేయ‌లేక పోయారు. కేవ‌లం మూడు వికెట్లు తీశారు. దీంతో న్యూజిలాండ్ 307 ప‌రుగుల టార్గెట్ ను ఇంకా 17 బంతులు మిగిలి ఉండ‌గానే టార్గెట్ పూర్తి చేసింది. ఇక‌నైనా బీసీసీఐ వికెట్లు తీసే బౌల‌ర్ల‌పై ఫోక‌స్ పెడితే బెట‌ర్.

ఇక‌నైనా బీసీసీఐ రాజ‌కీయాలు పెట్టి ప్ర‌తిభ క‌లిగిన బౌల‌ర్ల‌ను ఎంపిక చేసి..వారికి స‌రైన రీతిలో తర్ఫీదు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. లేక పోతే ఇలాంటి అప‌జయాలు ప‌ల‌క‌రిస్తూనే ఉంటాయి.

Also Read : చెల‌రేగిన టామ్..కేన్..కివీస్ విన్

Leave A Reply

Your Email Id will not be published!