Indian Constitution Comment : రాజ్యాంగం ప్రజా దేవాలయం
గణతంత్రం రణతంత్రం కాకూడదు
Indian Constitution Comment : దేశ వ్యాప్తంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ తరుణంలో న్యాయ వ్యవస్థకు కేంద్రంలో కొలువు తీరిన మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతోంది.
గత కొంత కాలం నుంచీ మాటల యుద్ధం కొనసాగుతూ వస్తోంది. అసలు భారత రాజ్యాంగంలో (Indian Constitution) న్యాయ వ్యవస్థకు కార్య నిర్వాహక వ్యవస్థకు మధ్య లక్ష్మణ రేఖ గీసింది. కొలీజియం వ్యవస్థపై కేంద్రం భగ్గుమంటోంది.
ఈ తరుణంలో మరోసారి రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినోత్సవాన్ని పురస్కరించుకుని చర్చించాల్సి వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే మన రాజ్యాంగం సమస్త దేశ ప్రజలందరికీ బైబిల్ , ఖురాన్ , భగవద్గీత లాంటిది.
అంతకు మించి చెప్పాలంటే ప్రజలందరికీ దేవాలయం కూడా. ఎన్నో విలక్షణమైన తీర్పులకు వేదికగా మారింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం. ఇదే సమయంలో రాజకీయాలు అవినీతికి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన తరుణంలో రాజ్యాంగం మరోసారి కీలకంగా మారింది.
ఒకవేళ భారత రాజ్యంగం గనుక లేక పోయి ఉంటే గుప్పెడు మంది చేతుల్లోనే దేశం మిగిలి పోయి ఉండేది. ఇప్పటికే దేశాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చారన్న అపవాదు ఎదుర్కొంటోంది.
వ్యవస్థలను నీరు గార్చడం, వనరులను దోచి పెట్టడం, అవకాశాలు లేకుండా చేయడం, సంక్షేమ పథకాల పేరుతో బురిడీ కొట్టించడం, ప్రజలకు ప్రత్యేకించి సామాన్యులకు విద్య, వైద్యం, ఉపాధి దూరం చేయడం కొనసాగుతూ వస్తున్నది.
డాక్టర్ బిఆర్ అంబేదర్కర్ సారథ్యంలో రూపు దిద్దుకున్న భారత రాజ్యాంగం(Indian Constitution) ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉండాలని స్పష్టం చేసింది. రాజ్యాంగం అన్నది లేక పోతే ఈ దేశంలో రాచరికం మాత్రమే మిగులుతుంది.
అప్పుడు సమాన అవకాశాలు మృగ్యమై పోతాయి. కోట్లాది ప్రజల జీవన ఆధారం ప్రశ్నార్థకంగా మారుతుంది. బడా బాబలు, అక్రమార్కులు,
పెట్టుబడిదారులు, కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు మాత్రమే రాజ్యాంగేతర శక్తులుగా తయారవుతారు. దీని వల్ల సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం ఇదే కొనసాగుతూ వస్తున్నది. రాజ్యాంగం లేక పోతే బాగుంటుందని కాషాయ వర్గాలు ఆలోచిస్తున్నాయి. ఒకే దేశం, ఒకే ఓటు , ఒకే నోటు, ఒకే భాష, ఒకే పార్టీ, ఒకే మతం ఉండాలన్నది వారి ఆలోచన.
దేశం అంటేనే భిన్న సంస్కృతుల సమ్మేళనం. అందరికీ మాట్లాడే స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు కల్పించింది. కానీ ఇవాళ నిలదీయడం నేరంగా మారింది.
చట్టాలు పాలకులకు చుట్టాలుగా మారి పోయాయి. ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా లేదా నోట్లకు అమ్ముడు పోయే వారిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.
భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ఓటుకు రూ. 6,000 ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు.దీన్ని బట్టి చూస్తే ప్రజాస్వామ్యం పరిహాసానికి గురవుతున్నదనేది వాస్తవం.
ఇప్పటి వరకు ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ ఒక్క ప్రకటన చేయలేదు.ఈ సందర్భంగా అంబేద్కర్ అన్న మాటల్ని మరోసారి గుర్తు చేసుకోవాలి. మెజారిటీ ఉన్నంత మాత్రాన ఆధిపత్యం చెలాయిస్తామంటే కుదరదు. అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు అని.
గుజరాత్ లో మైనార్టీ మహిళను సామూహిక అత్యాచారానికి పాల్పడి జీవిత ఖైదుకు గురైన వారిని బీజేపీ ప్రభుత్వం బెయిల్ పై విడుదల చేసింది.
అంతే కాదు యూపీలో లఖింపూర్ ఖేరిలో రైతులపైకి వాహనం నడిపి చావులకు కారకుడైన కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు ఇవాళ ఆరు వారాల పాటు బెయిల్ దొరికింది. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా.
ఎటు పోతుంది ఈ దేశం. భారత రాజ్యాంగం గొప్పది. కానీ దానిలోని లొసుగులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం మాత్రం క్షమార్హం కాదు. ఇది గుర్తిస్తే బెటర్. లేక పోతే దేశం ప్రమాదపు అంచుల్లోకి వెళ్లడం మాత్రం ఖాయం.
Also Read : రిపబ్లిక్ వేడుకల బాధ్యత ప్రభుత్వానిదే