Team India New Jersy : భారత క్రికెట్ జట్టు న్యూ జెర్సీ ఆవిష్కరణ
అక్టోబర్ లో జరిగే వరల్డ్ కప్ కోసం రిలీజ్
Team India New Jersy : వచ్చే అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ 2022 కోసం భారత క్రికెట్ జట్టు తమ జెర్సీని(Team India New Jersy) ఆవిష్కరించించింది.
ఈ మెగా ఈవెంట్ కు సంబంధించి స్కై బ్లూ (ఆకాశపు నీలి రంగు ) రంగులోకి మారాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది.
గతంలో స్కై బ్లూ జెర్సీని(Team India New Jersy) ధరించినప్పుడు భారత జట్టు మూడు ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన టైటిళ్లను గెలుచుకుంది. ఇటీవల టీమిండియా ఆశించిన మేర రాణించడం లేదు.
ఎప్పటి లాగే వన్డే, టి20, టెస్టులలో గెలుస్తూ వస్తున్నా మెగా ఈవెంట్లలో మాత్రం చతికిల పడుతోంది. ప్రధానంగా యూఈఏ వేదికగా గత ఏడాది 2021లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో వెను దిరిగింది.
తాజాగా ఇదే వేదికగా జరిగిన ఆసియా కప్ -2022 లో కూడా శ్రీలంక చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. సూపర్ -4 దశలో రెండు కీలక మ్యాచ్ లను కోల్పోయింది.
అత్యంత పేలవమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది భారత జట్టు. ఆ తర్వాత టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లను ఎంపిక చేయక పోవడం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది భారత సెలెక్షన్ కమిటీ.
ప్రధానంగా కేరళ స్టార్ ఆటగాడు సంజూ శాంసన్(Sanju Samson) ను ఎందుకు ఎంపిక చేయలేదంటూ ట్రోలింగ్ కు గురైంది. దీంతో దెబ్బకు సంజూను ఇండియా-ఎ జట్టుకు కెప్టెన్ ను చేసింది.
Also Read : పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి ఖాయం