Manipur President’s Rule :మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన భారత సర్కార్

అందుకు అనుగుణంగా, కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది...

Manipur : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు, ఫిబ్రవరి 9న రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌(Manipur)లో రాష్ట్రపతి పాలన విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ రాష్ట్రంలో దాదాపు రెండు సంవత్సరాలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.

Manipur going under President’s Rule

మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్(Manipur) అట్టుడుకుతోంది. ఇది ఇంకా రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఈ క్రమంలో, బిరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాలతో, బిరేన్ సింగ్ రాజీనామా తర్వాత రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు చర్చలు జరిగాయి. అందుకు అనుగుణంగా, కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(1) ప్రకారం, రాష్ట్ర అసెంబ్లీలు చివరిసారిగా సమావేశమైన ఆరు నెలల్లోపు సమావేశమవ్వాలి. మణిపూర్‌లో చివరి అసెంబ్లీ సమావేశం ఆగస్టు 12, 2024న జరిగింది. ఈ నేపథ్యంలో, బుధవారం తదుపరి సమావేశానికి గడువు విధించారు. అయితే, ఆదివారం ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామా చేయడంతో, సోమవారం ప్రారంభం కావాల్సిన బడ్జెట్ సమావేశాన్ని గవర్నర్ అజయ్ భల్లా రద్దు చేశారు.

మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 10 నుండి ప్రారంభం కావాల్సి ఉండగా, కాంగ్రెస్ బిరేన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికి సిద్ధమైంది. అయితే, సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేయడంతో బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు, ఆ రాష్ట్ర పాలనలో అనేక మార్పులు వస్తాయి. రాష్ట్రపతి నియంత్రణలో రాష్ట్ర పరిపాలన వస్తుంది. ఆయన ప్రతినిధిగా గవర్నర్‌ను నియమించి పరిపాలన నడిపించవచ్చు.

సాధారణంగా, రాష్ట్ర అసెంబ్లీలు చట్టాలు చేస్తాయి. కానీ, రాష్ట్రపతి పాలన సమయంలో, పార్లమెంటు రాష్ట్ర చట్టాలను రూపొందిస్తుంది. సమావేశాలు జరగకపోతే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. రాష్ట్రపతి పాలన గరిష్టంగా 6 నెలలు కొనసాగవచ్చు. అయితే, దీనిని 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు, కానీ పార్లమెంటు అనుమతి అవసరం.

ఏ రాష్ట్రంలోనైనా, రాజ్యాంగ నిబంధనలు పాటించకపోతే, శాంతిభద్రతలు విఫలమైతే, లేదా ప్రభుత్వాన్ని స్థిరపరచలేకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఇలా, రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉండగా, గవర్నర్ అజయ్ భల్లా గురువారం సీనియర్ భద్రతా అధికారులతో సమావేశం నిర్వహించి భద్రతా చర్యలపై చర్చలు జరిపారు.

Also Read : నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఉరటనిచ్చిన సుప్రీంకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!