Thomas Cup India : భారత్ సంచలనం థామస్ కప్ విజయం
చరిత్ర సృష్టించిన భారత ఆటగాళ్లు
Thomas Cup India : భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు తొలిసారిగా స్వర్థం సాధించి చరిత్ర సృష్టించచింది. థామస్ కప్(Thomas Cup India) ను చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు 14 సార్లు ఛాంపియన్ గా ఉన్న ఇండోనేషియాను ఓడించింది.
తొలి సారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది. థామస్ కప్ లో భారత జట్టు 3-0 తేడాతో ఇండోనేషియాను ఓడించింది. మొదటిసారి ఫైనల్ కు చేరింది భారత జట్టు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరు కనబర్చింది.
ఇండోనేషియాను చిత్తు చేసింది. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత అయిన ఆంథోని గింటింగ్ ను 20 ఏళ్ల లక్ష్య సేన్ ఓడించడంతో ఇదంతా ప్రారంభమైంది.
డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకి రెడ్డి, చిరాగ్ శెట్టి జోడి 18-21, 23-21, 21-19 తేడాతో ఇండోనేషియాకు చెందిన మహ్మద్ అహ్సన్ , కెవిన్ సంజయ సుకముల్లో పై గెలుపొంది 2-0 ఆధిక్యాన్ని అందించారు.
చివరగా కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21 స్కోరుతో జోనాటన్ క్రిస్టినీ ఓడించి భారతదేశాన్ని చారిత్రాత్మక విజయాన్ని ముగించాడు. దీంతో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లయింది.
ఇదిలా ఉండగా థామస్ కప్(Thomas Cup India) లో భారత్ ఫైనల్ కు చేరుకోవడం ఇదే తొలిసారి. కాగా ఫైనల్ లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగింది. లక్ష్యసేన్ – రింకీ రెడ్డి – శెట్టి డబుల్స్ జోడీ ఇద్దరూ తమ ఓపెనింగ్ గేమ్ లో ఓడి పోయాక తిరిగి వచ్చారు.
గింటింగ్ తో జరిగిన ఓపెనింగ్ గేమ్ లో లక్ష్య సేన్ 8-21 తో ఓడి పోయాడు. కానీ రెండో గేమ్ ను 21-17తో గెలిచి పుంజుకున్నాడు.
Also Read : గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 134 రన్స్