Indian Women Team : కామన్వెల్త్ గేమ్స్ కు భారత జట్టు డిక్లేర్
జట్టు కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్
Indian Women Team : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్ లోని బర్మింగ్ హోమ్ లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును(Indian Women Team) ప్రకటించింది.
టి20 ఫార్మాట్ లో ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులు కలిగిన భారత జట్టుకు పంజాబ్ కు చెందిన స్టార్ క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ ను ఎంపిక చేసింది.
ఆమెకు సహాయకారిగా వైస్ కెప్టెన్ గా ముంబై స్టార్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్ కు అప్పగించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే శ్రీలంక టూర్ ముగించుకుని భారత్ కు విజేతగా తిరిగి వచ్చింది.
టీ20 సీరీస్ లో 2-1 తేడాతో గెలుపొందింది. ఇక మూడు వన్డేల సీరీస్ లో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు దుమ్ము రేపింది. వరుసగా మూడు వన్డే మ్యాచ్ లలో జయకేతనం ఎగుర వేసింది.
సీరీస్ కైవసం చేసుకుంది. భారత మహిళా క్రికెటర్లు(Indian Women Team) అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. ప్రధానంగా అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటారు.
ఏపీకి చెందిన క్రికెటర్ సబ్బినేని మేఘనకు కూడా చోటు దక్కింది. హైదరాబాదీ క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో హర్మన్ ప్రీత్ కౌర్ కు కెప్టెన్సీ లభించింది.
జట్టు పరంగా చూస్తే హర్మన్ ప్రీత్ కెప్టెన్. స్మృతి మంధాన వైస్ కెప్టెన్ కాగా షఫాలీ వర్మ, మేఘన, తానియా, యస్తిక, దీప్తి శర్మ, రాజేశ్వరి, పూజా వస్త్రాకర్ , మేఘనా సింగ్ , రేణుక సింగ్ , జెమీమా, రాధా యాదవ్ , హర్లీన్ , స్నేహ్ రాణా ఉన్నారు.
Also Read : ఐపీఎల్ అయితే రెస్ట్ తీసుకుంటారా – సన్నీ