U19 Team Kala Chashma : భార‌త మ‌హిళా జ‌ట్టు డ్యాన్స్ అదుర్స్

పాపుల‌ర్ కాలా చ‌ష్మా పాట‌కు స్టెప్పులు

U19 Team Kala Chashma : దక్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్ 19 తొలి మ‌హిళా ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023ని భార‌త మ‌హిళా జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ మ‌హిళా జ‌ట్టును ఓడించి విశ్వ విజేత‌గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా టీమిండియా ఆట‌గాళ్లు ప‌ట్ట‌రాని ఆనందంతో గంతులు వేశారు. త‌మ ఆనందాన్ని పాట రూపంలో పంచుకున్నారు. ఇప్ప‌టికే పాపుల‌ర్ అయిన హిందీ సాంగ్ కాలా చ‌ష్మా(U19 Team Kala Chashma) సాంగ్ కు స్టెప్పులు వేశారు. ఔరా అనిపించేలా చేశారు.

క్రికెట్ ఫ్యాన్స్ ను విస్తు పోయేలా చేశారు భార‌త క్రికెట‌ర్లు . గెలుపొందిన వెంట‌నే మైదానంలో త‌మ సంతోషాన్ని పంచుకున్నారు. షెఫాలీ వ‌ర్మ సార‌థ్యంలోని అండ‌ర్ 19 జ‌ట్టు స‌త్తా చాటింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది భార‌త మ‌హిళా జ‌ట్టు. ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటుతున్న వేళ భార‌త జ‌ట్టు విజ‌యాన్ని పొందుతోంది. నీలి రంగు దుస్తులు ధ‌రించారు మ‌హిళా క్రికెట‌ర్లు. మెడ‌లో మెడ‌ల్స్ ధ‌రించి స్టైల్ గా కాలా చ‌ష్మా(U19 Team Kala Chashma) పాట‌కు ఆక‌ట్టుకునేలా స్టెప్పులు వేయ‌డం ఫ్యాన్స్ ను మ‌రింత ఉత్సాహ ప‌రిచేలా చేసింది. ఇదిలా ఉండ‌గా భార‌త జ‌ట్టు గెలుపొందిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు దేశ రాష్ట్ర ప‌తి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు 7 ల‌క్ష‌ల‌కు పైగా లైక్ లు రావ‌డం విశేషం. 3 వేల‌కు పైగా కామెంట్స్ కూడా రావ‌డం విశేషం. సినీ రంగానికి చెందిన సెల‌బ్రిటీలు సైతం జ‌ట్టును అభినందించారు.

Also Read : వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌కు రూ. 5 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!