Mohammad Wasim : పాకిస్తాన్ చేతిలో భార‌త్ ఓట‌మి ఖాయం

పాకిస్తాన్ చీఫ్ సెలెక్ట‌ర్ ముహ‌మ్మ‌ద్ వాసిమ్

Mohammad Wasim : పాకిస్తాన్ త‌న నైజాన్ని భార‌త్ ప‌ట్ల త‌న‌కున్న ద్వేషాన్ని ప్ర‌తిసారి వెళ్ల‌గ‌క్కుతూనే ఉంది. కానీ భార‌త జ‌ట్టు , బీసీసీఐ మాత్రం అత్యంత స్నేహ పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఆ విష‌యం బోర్డు కంటే పాకిస్తాన్ క్రికెట‌ర్ల‌కు బాగా తెలుసు. గాయ‌ప‌డిన పాక్ పేస‌ర్ యోగ క్షేమాల‌ను అడిగిన భార‌త ప్లేయ‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు పాక్ ఆటగాళ్లు.

కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరు మాత్రం మార‌డం లేదు. తాజాగా అక్టోబ‌ర్ లో ఆస్ట్రేలియా వేదిక‌గా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే ప‌లు దేశాలు త‌మ తుది జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి.

పీసీబీ కూడా త‌మ జ‌ట్టును వెల్ల‌డించింది. అయితే ఆ జ‌ట్టు ఎంపిక‌పై ఆ దేశానికి చెందిన మాజీ ఆట‌గాళ్లు నిప్పులు చెరుగుతున్నారు. ప్ర‌ధానంగా పీసీబీ చైర్మ‌న్ తో పాటు సెలెక్ట‌ర్ల‌ను ఏకి పారేస్తున్నారు.

దీంతో సెలెక్ట‌ర్లు విమ‌ర్శ‌ల‌కు జ‌వాబు ఇవ్వ‌లేక భార‌త జ‌ట్టును టార్గెట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ చీఫ్ సెలెక్ట‌ర్ ముహ‌మ్మ‌ద్ వాసిమ్(Mohammad Wasim) కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు.

గ‌త ఏడాది యూఏఈ వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో బిలియ‌న్ డాల‌ర్ల టీమ్ గా పేరొందిన టీమిండియాకు ఘోర ప‌రాజ‌యాన్ని క‌లిగేలా చేశామ‌న్నారు.

10 వికెట్ల తేడాతో ఓడించిన ఘ‌న‌త పాక్ జ‌ట్టుకు ఉంద‌న్నారు. ఇదే ఏడాది యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2022లో సైతం పాకిస్తాన్ చేతిలో ఘోరంగా ఓట‌మి చ‌వి చూసింద‌న్నారు.

ఇదే సీన్ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రిపీట్ అవుతుంద‌ని, త‌మ ఆట‌గాళ్లు రంకెలు వేస్తున్నార‌ని కితాబు ఇచ్చాడు. తాము ఎంపిక చేసిన టీం ప‌ర్ ఫెక్ట్ గా ఉంద‌ని అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటేందుకు సిద్ద‌మై ఉన్నార‌ని స్ప‌ష్టం చేశాడు వాసిమ్.

Also Read : భార‌త క్రికెట్ జ‌ట్టు న్యూ జెర్సీ ఆవిష్క‌ర‌ణ

Leave A Reply

Your Email Id will not be published!