Sanath Jayasuriya : భారత్ సాయం మరిచి పోలేం – జయసూర్య
త్వరలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలి
Sanath Jayasuriya : భారత క్రికెటర్లు ఐపీఎల్ కోసం అసలైన ఆట ఆడకుండా రెస్ట్ తీసుకుంటుంటే శ్రీలంకకు చెందిన మాజీ ఆటగాళ్లు మాత్రం తమ దేశం కోసం ప్రజలతో కలిసి పోరాడుతున్నారు. అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు.
ఓ వైపు ఆర్థిక, ఆహార, ఆయిల్, విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది దాయాది ద్వీప దేశం శ్రీలంక. ఎక్కడ చూసినా నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతోంది.
1948 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా ఎన్నడూ ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఆ దేశం ఎదుర్కోలేదు. దీనికంతటికీ గోటబోయ, మహీంద రాజపక్సేల కుటుంబ రాచరిక పాలనే కారణమంటూ పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని నెలల తరబడి తిండి కోసం, గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. పెట్రోల్ కోసం రోజుల కొద్దీ నిల్చుండడంతో ఇప్పటి వరకు కనీసం
100 మందికి పైగా ఆకలి చావులకు గరైనట్లు సమాచారం.
ఈ తరుణంలో ఒక్కసారిగా వేలాది మంది తండోప తండాలుగా తరలి వచ్చారు. దేశ అధ్యక్షుడి రాజ భవనాన్ని ముట్టడించారు. ఆయన భవనంలోనే ఆందోళనకారులు తిష్ట వేశారు.
సైన్యం చేతులెత్తేసింది. ప్రధాన మంత్రికి రాజీనామా చేసిన మహీంద ఆర్మీ క్యాంపులో తలదాచుకున్నాడు. ఇక ప్రెసిడెంట్ గోటబోయ రాజపక్సే
భయంతో పారి పోయాడు.
ఆపై ఓడ ఎక్కి ఇతర దేశాల్లో తలదాచుకున్నాడు. ఈ తరుణంలో జనంతో కలిసి తాను కూడా పాల్గొన్నాడు మాజీ క్రికెటర్, స్టార్ ఓపెనర్ సనత్ జయసూర్య. రాజపక్సే రాచరికం పోవాలంటూ జాతీయ పతాకంతో నినాదాలు చేశాడు.
ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా జయసూర్యకు జేజేలు పలికారు జనం. ఈ తరుణంలో తీవ్ర
ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంకకు మానవతా దృక్ఫథంతో ఆదుకున్న భారత్ కు ధన్యవాదాలు తెలిపాడు జయసూర్య(Sanath Jayasuriya).
కాగా సుస్థితర ప్రభుత్వం ఏర్పాటు కావాలని, తాను రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశాడు.
Also Read : పార్లమెంట్ లో అగ్నిపథ్ పైనే ఫోకస్