Indigo Air Hostess : ఎయిర్ హోస్టెస్ కంట‌త‌డి వైర‌ల్

నెట్టింట్లో వీడియో హ‌ల్ చ‌ల్

Indigo Air Hostess : ఎవ‌రు ఎప్పుడు వైర‌ల్ అవుతారో చెప్ప‌డం క‌ష్టం. తాజాగా ఇండిగో ఎయిర్ హోస్టెస్(Indigo Air Hostess) కంట త‌డి పెట్ట‌డం హ‌ల్ చ‌ల్ గా మారింది నెట్టింట్లో. ఎయిర్ హోస్టెస్ కు వీడ్కోలు ప‌లికే సంద‌ర్బంగా సందేశం క‌న్నీళ్ల‌ను తెప్పించేలా చేసింది.

ఎయిర్ క్రాఫ్ట్ లోని ప‌బ్లిక్ అనౌన్స్ మెంట్ సిస్ట‌మ్ పై మాట్లాడుతూ ప్ర‌తి ఫ్లైయ‌ర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపంది. ఎయిర్ హోస్ట‌స్ క‌న్నీళ్లు పెట్టుకున్న ఈ వీడియోను సింగ‌ర్, రేడియో జాకీ అమృత్ సురేష్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

వీడ్కోలు చెప్ప‌డం జీవితంలో క‌ష్ట‌త‌ర‌మైన విష‌యాల‌లో ఒక‌టి కావ‌డం స‌హ‌జం.ఈ వీడియోలో ఇండిగో ఫ్లైట్ అటెండెంట్ త‌న చివ‌రి ప‌ని రోజున ప్ర‌యాణికుల‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న‌ప్పుడు అనుకోకుండానే క‌న్నీళ్లు పెట్టుకుంది.

ఎయిర్ హోస్టెస్ గా ప‌ని చేసే ప్ర‌తి ఒక్క‌రు ప‌బ్లిక్ అనౌన్స్ మెంట్ చేయ‌డం విధుల్లో భాగం. ఇందులో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈ హెయిర్ హోస్టెస్ కంట (Indigo Air Hostess)త‌డి పెట్ట‌డం ప్ర‌యాణికుల‌నే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా నెటిజ‌న్ల గుండెల్ని తాకింది.

ఇదిలా ఉండ‌గా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్ప‌టి వ‌ర‌కు 3.79 ల‌క్ష‌ల‌కు పైగా వీక్ష‌ణ‌లు, ఇంట‌ర్నెట్ వినియోగ‌దారుల నుంచి చాలా ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

ఇండిగో ద్వారా ఈ అంద‌మైన మ‌హిళ‌కు ఎంత అందంగా పంపబ‌డింది..చాలా హృద‌యాల‌ను తాకింది అంటూ కొంద‌రు పేర్కొన్నారు.
నాకు ఇప్పుడు వెళ్లాల‌ని లేదు.

కానీ వెళ్ల‌క త‌ప్ప‌దు. ఏం చెప్పాలో తెలియ‌డం లేదు. త‌న‌ను ప్రోత్స‌హించి ప‌ని చేసే అవ‌కాశాన్ని ఇచ్చిన ఇండిగో కంపెనీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Also Read : వారి ఇష్టం మేర‌కు బ‌త‌క‌నీయండి

Leave A Reply

Your Email Id will not be published!