INDW vs AUSW 4th T20 : భార‌త్ పై విజ‌యం ఆసిస్ సీరీస్ కైవ‌సం

7 ప‌రుగుల తేడాతో అప‌జయం

INDW vs AUSW 4th T20 : ఐదు మ్యాచ్ ల టి20 సీరీస్ ను 3-1 తేడాతో కైవ‌సం చేసుకుంది బ‌ల‌మైన ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు. భార‌త మ‌హిళా జ‌ట్లు కేవ‌లం ఒక్క మ్యాచ్ మాత్ర‌మే గెలుపొందింది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్ లో గెలుపొందినా ఫాయిదా లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే సీరీస్ ఆసిస్ వ‌శ‌మైంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే నాలుగో టి20 మ్యాచ్ లో(INDW vs AUSW 4th T20) ఆతిథ్య ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 189 ప‌రుగుల భారీ టార్గెట్ ముందుంచింది. అయితే టీమిండియా చివ‌రి దాకా పోరాడింది. 5 వికెట్లు కోల్పోయి 181 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

దీంతో ఏడు ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌వి చూసింది. టాస్ గెలిచిన భార‌త మ‌హిళా జ‌ట్టు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్ హీలీ 30 ర‌న్స్ చేసి రాణిస్తే మూనీ, త‌హ్లియా నిరాశ ప‌రిచారు. ఆష్లే గార్డెనర్ 42 ర‌న్స్ చేసి ఇన్నింగ్స్ చ‌క్కదిద్దింది. మ‌రో వైపు ఎల్లీస్ పెర్రీ దుమ్ము రేపింది.

కేవ‌లం 42 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 72 ర‌న్స్ చేసింది. ఆఖ‌రున వ‌చ్చిన గ్రేస్ హ‌ర్రీస్ కేవ‌లం 12 బంతులు మాత్రమే ఎదుర్కొని 27 ర‌న్స్ చేసింది.

అనంత‌రం మైదానంలోకి దిగిన భార‌త మ‌హిళా జ‌ట్టులో మంధాన 16 , ష‌ఫాలీ వ‌ర్మ 20 ర‌న్స్ చేసి నిరాశ ప‌రిచారు. కెప్టెన్ కౌర్ 46 , దేవిక వైద్య 32 ప‌రుగుల‌తో రాణించ‌డంతో విజ‌యంపై ఆశ చిగురించింది. రీచా 40 , దీప్తి శ‌ర్మ 12 ర‌న్స్ చేసినా విజయం ద‌క్క‌లేదు.

Also Read : అర్జెంటీనా ఫ్రాన్స్ బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!