INDW vs BANW 1st T20 : భార‌త అమ్మాయిలు అదుర్స్

బంగ్లా జ‌ట్టుపై గ్రాండ్ విక్ట‌రీ

INDW vs BANW 1st T20 : పురుషుల‌తో పాటు తాము కూడా ఏమీ తీసిపోమంటూ దుమ్ము రేపుతున్నారు భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు. బంగ్లాదేశ్ టూర్ ను స‌క్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేసింది టీమిండియా(INDW vs BANW 1st T20). బంగ్లా టూర్ లో భాగంగా ఇవాళ బంగ్లాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

బంగ్లా దేశ్ రాజ‌ధాని ఢాకా లోని షేర్ బంగ్లా జాతీయ మైదానంలో మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మ‌హిళ‌లు అదుర్స్ అనిపించేలా ఆడారు. ఏకంగా ఆతిథ్య జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. 7 వికెట్ల తేడాతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై గెలుపు సాధించారు. ఔరా అనిపించేలా చేశారు.

మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చాటి చెప్పింది పంజాబ్ కు చెందిన భార‌త క్రికెట్ జ‌ట్టు మ‌హిళా కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్. తాజాగా భార‌త్ లో జ‌రిగిన విమెన్ ప్రిమీయ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) లో అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌తో ఆక‌ట్టుకుంది. అదే జోరును బంగ్లాదేశ్ తో కూడా కంటిన్యూ చేసింది స్కిప్ప‌ర్ కౌర్.

54 ప‌రుగుల‌తో రాణించింది. భార‌త జ‌ట్టు గెలుపు సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. దీంతో మూడు టి20 సీరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ను భార‌త్ కైవ‌సం చేసుకుంది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 114 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రి లోకి దిగిన భార‌త్ కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి స‌క్సెస్ సాధించింది.

Also Read : Heavy Rains : భారీ వ‌ర్షం ఢిల్లీ అత‌లాకుత‌లం

Leave A Reply

Your Email Id will not be published!