INDW vs ENGW T20 World Cup : ఇండియా ఇంగ్లండ్ బిగ్ ఫైట్

ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో

INDW vs ENGW T20 World Cup : ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ మ‌హిళా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కీల‌క మ్యాచ్ కు సిద్ద‌మైంది భార‌త మ‌హిళా జ‌ట్టు. గ్రూప్ – బిలో కొన‌సాగుతున్న టీమిండియా తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను , రెండో మ్యాచ్ లో వెస్టిండీస్ ను ఓడించింది. మ‌రో వైపు గ్రూప్ – ఏలో ఆస్ట్రేలియా ఇప్ప‌టికే సెమీస్ బెర్త్ ఓకే చేసుకుంది.

ఆ గ్రూప్ లో శ్రీ‌లంక మూడు మ్యాచ్ లు ఆడి 2 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ క‌ప్ ఫెవ‌రేట్స్ గా ఇంగ్లండ్ తో పాటు ఆస్ట్రేలియా జ‌ట్లు ఉన్నాయి. ఇక గ్రూప్ – బిలో టాప్ లో కొన‌సాగుతోంది ఇంగ్లండ్ . ప్ర‌స్తుతం భార‌త్ , ఇంగ్లండ్ పోటీ(INDW vs ENGW T20 World Cup) ప‌డేందుకు రెడీ అంటున్నాయి. ఒక ర‌కంగా టీమిండియా క‌ఠిన ప‌రీక్ష‌ను ఎదుర్కొంటోంది. 

టాప్ ఆర్డ‌ర్ బ‌లంగా ఉంది. కాగా పాకిస్తాన్ తో జ‌రిగిన ఓపెనింగ్ కు దూర‌మైన స్మృతీ మంధాన త‌దుప‌రి విండీస్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఆశించిన మేర ఆక‌ట్టు కోలేక పోయింది. ప్ర‌స్తుతం వైస్ కెప్టెన్ గా ఉన్న మంధాన త‌ప్ప‌నిస‌రిగా రాణించాల్సిన అవ‌స‌రం ఉంది.

కేవ‌లం 10 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది స్మృతీ. ఇక అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకున్న జ‌ట్టుకు సార‌థిగా ఉన్న షెఫాలీ వ‌ర్మ సూప‌ర్ ఫామ్ లో కొన‌సాగుతోంది. ఆమె పాకిస్తాన్ తో 33 , విండీస్ తో 28 ర‌న్స్ చేసింది. ఇక జెమీమా పాకిస్తాన్ పై అజేయంగా 53 ర‌న్స్ చేసింది . 

కెప్టెన్ కౌర్ 33 ర‌న్స్ తో ఆక‌ట్టుకుంది. కానీ చివ‌రి దాకా నిల‌వ లేక పోయింది. ఇక భార‌త జ‌ట్టులో టాప్ ప‌ర్ ఫార్మ‌ర్ గా ఉంది రిచా ఘోష్ . ఆమె పాక్ తో 31, విండీస్ తో 44 ర‌న్స్ చేసింది. వీరితో పాటు దేవికా వైద్య‌, పూజా వ‌స్త్రాక‌ర్ , త‌దిత‌రులు రాణించ‌డంపై జ‌ట్టు స‌క్సెస్ ఆధార ప‌డి ఉంది.

Also Read : మార్చి 31 నుంచి ఐపీఎల్ సంబురం

Leave A Reply

Your Email Id will not be published!