INDW vs PAKW T20 World Cup : వరల్డ్ కప్ లో పాక్ కు భారత్ షాక్
7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ
INDW vs PAKW T20 World Cup : హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు దక్షిణాఫ్రికా వేదిక పై జరుగుతున్న ఐసీసీ మహిళల టి20 వరల్డ్ కప్ లో ఆరంభంలో దుమ్ము రేపారు. నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంకా ఒక ఓవర్ ఉండగానే పూర్తి చేశారు. ఏకంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేశారు.
ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు భారత్(INDW vs PAKW T20 World Cup) ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. బరిలోకి దిగిన భారత జట్టు లో జెమీమా రోడ్రిగ్స్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 38 బంతులు ఎదుర్కొని 53 రన్స్ చేసింది. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి. టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఇక అండర్ -19 వరల్డ్ కప్ ను తీసుకు వచ్చిన సారథి షెఫాలీ వర్మ రాణించింది. 33 పరుగులు చేసింది. ఆమెతో పాటు రిచా ఘోష్ 31 రన్స్ తో ఆకట్టుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 16 , యాస్తికా భాటియా 17 రన్స్ మాత్రమే చేశారు.
ఇక పాకిస్తాన్ బౌలర్లలో నష్రా సంధు 2 వికెట్లు తీస్తే నదియా ఇక్బాల్ ఒక వికెట్ తో సరి పెట్టుకుంది. భారత జట్టు గెలుపొందడంలో కీలక భూమికను పోషించిన జెమీమా రోడ్రిగ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక భారత్ టీమ్ అరుదైన ఘనత సాధించింది. వరల్డ్ కప్ లో భారీ టార్గెట్ ను ఛేదించిన టీమ్ గా చరిత్ర సృష్టించింది. అంతకు ముందు భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన పాకిస్తాన్ ను కట్టడి చేసింది.
జవేరియా ఖాన్ 8, మునీబా అలీ 12, నిదా దార్ డకౌట్ గా వెనుదిరిగారు. సిద్రా అమీన్ 11 రన్స్ చేసి నిరాశ పరిచింది. కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించింది పాకిస్తాన్ స్కిప్పర్ బిస్మా మరూఫ్ 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. అయేషా నసీం 43 రన్స్ చేసింది. 4 వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేసింది పాకిస్తాన్ జట్టు.
Also Read : కేఎల్ రాహుల్ పై సన్నీ కామెంట్స్