INDW vs PKW CWG 2022 : కామన్‌వెల్త్ గేమ్స్ లో దాయాదుల పోరు

భార‌త్ పాకిస్తాన్ మ‌ధ్య కీల‌క క్రికెట్ మ్యాచ్

INDW vs PKW CWG 2022 : చాలా కాలం త‌ర్వాత కామ‌న్ వెల్త్ గేమ్స్ లో క్రికెట్ ను ప్ర‌వేశ పెడుతున్నారు. జూలై 28 నుంచి ఆగ‌స్టు 8 వ‌ర‌కు బ‌ర్మింగ్ హోమ్ వేదిక‌గా ప్రారంభం కానున్నాయి. ఈ గేమ్స్ లో పాల్గొనేందుకు ఆయా దేశాల‌కు చెందిన ప్ర‌తిభ క‌లిగిన క్రీడాకారులు రెడీ అవుతున్నారు.

త‌మ స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిర‌కాల ప్ర‌త్య‌ర్థులుగా భావించే భార‌త‌, పాకిస్తాన్ మ‌హిళా జ‌ట్లు త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మ‌య్యాయి. ఈనెల 31న దాయాదుల మ‌ధ్య అస‌లైన పోరు కొన‌సాగ‌నుంది.

ఇదిలా ఉండ‌గా ఈసారి భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) కేవ‌లం మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకు మాత్ర‌మే ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఈ మెగా గేమ్స్ లో రెండు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూప్ -ఎ గ్రూప్ లో భార‌త జ‌ట్టు ఉంది.

ఈ టోర్నీలో టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, పాకిస్తాన్ , బార్బోడ‌స్ జ‌ట్లు(INDW vs PKW CWG 2022) పాల్గొంటున్నారు. కాగా భార‌త్ , పాకిస్తాన్ ఇత‌ర జ‌ట్ల‌తో త‌ల‌ప‌డ‌నున్నాయి. రెండో మ్యాచ్ లో ప్ర‌త్య‌ర్థులు ఇద్ద‌రూ త‌ల‌ప‌డేందుకు సై అంటున్నారు.

ఈ పోటీల‌ను టి20 ఫార్మాట్ లో చేప‌ట్టేందుకు నిర్ణ‌యించారు. చాలా రోజుల త‌ర్వాత తిరిగి కామ‌న్ వెల్త్ గేమ్స్ లో క్రికెట్ ను తిరిగి ప్ర‌వేశ పెట్టారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐపీఎల్ స‌క్సెస్ కావ‌డంతో అమెరికా లాంటి డెవ‌ల‌ప్ కంట్రీస్ సైతం భారీ ఆస‌క్తిని చూపుతున్నాయి.

ఇటీవ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా భార‌త జ‌ట్టు దాయాది పాకిస్తాన్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది. భారీ తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. అయితే ఈసారి స్టార్ ప్లేయ‌ర్ మిథాలీ రాజ్ లేదు. ఆమె ఇటీవ‌లే ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌క‌టించింది.

Also Read : భార‌త్ విండీస్ టూర్ షెడ్యూల్

Leave A Reply

Your Email Id will not be published!