INDW vs SLW 1st T20 : భారత్ భళా శ్రీలంక డీలా
మహిళా జట్టు శుభారంభం
INDW vs SLW 1st T20 : ఆతిథ్య జట్టు శ్రీలంకపై ఘన విజయాన్ని నమోదు చేసింది భారత మహిళల క్రికెట్ జట్టు. శ్రీలంక మహిళా జట్టుపై 34 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా(INDW vs SLW 1st T20) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది.
పేలవమైన ప్రదర్శనతో వన్డే వరల్డ్ కప్ కు దూరమైన జెమీమా రోడ్రిగ్స్ రాణించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకుంది తన ఆట తీరుతో.
కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న జెమీమా 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఇందులో 3 ఫోర్లు ఒక సిక్స్ ఉంది.
శ్రీలంకలోని దంబుల్లాలో జరిగిన మొదటి టి20 మ్యాచ్(INDW vs SLW 1st T20) లో మరో ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది.
31 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేసింది. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఇక స్టార్ ఓపెనర్ స్మృతి మందాన, ఏపీకి చెందిన మేఘన విఫలమయ్యారు.
మంధాన ఒక పరుగుతు చేస్తే మేఘన సున్నాకే ఔట్ అయింది. కెప్టెన్ గా ప్రమోషన్ పొందిన హర్మన్ ప్రీత్ కౌర్ 20 బంతులు ఆడి 22 రన్స్ చేసింది. ఇందులో 3 ఫోర్లు ఉన్నాయి.
చివరలో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ 8 బంతులు ఆడి 17 పరుగులు చేసింది. ధాటిగా ఆడడంతో భారత్ ఆ స్కోర్ చేసింది. ఇక 139 పరుగుల
లక్ష్యంతో మైదానంలోకి దిగిన శ్రీలంక మహిళా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులకే పరిమితమైంది.
లంక బౌలర్లలో రణవీర 3 వికెట్లు తీస్తే రణసింఘే 2 వికెట్లు తీసింది. భారత్ తరపున రాధా యాదవ్ కు 2 వికెట్లు దక్కాయి.
Also Read : జోస్ బట్లర్ ను మరిచి పోలేను – జైశ్వాల