PPF Scheme : పీపీఎఫ్ లో జమ బతుక్కి ధీమా
నెల నెలా పొదుపు ఆదాయానికి మలుపు
PPF Scheme : ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. రోజు రోజుకు ఉద్యోగాలు ఉంటాయో లేవోనన్న టెన్షన్. ఈ సమయంలో బతకాలంటే, రోజూ వారీ ఖర్చులను భరించాలంటే చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది.
రోజు రోజుకు బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. రెపో రేటు పెంచినా దాని ప్రభావం మదుపరులు, ఖాతాదారులపై పడుతోంది.
ఎలాంటి రిస్క్ లేకుండా హాయిగా బతకాలంటే నెల నెలా కొంత మొత్తంలో పొదుపు చేస్తే కొన్నేళ్ల పాటు నిరీక్షిస్తే పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది.
మరి ఎందులో మదుపు చేయాలనే అనుమానం కలుగుతుంది. ఇందుకు సంబంధించి బెస్ట్ ఆప్షన్ పీపీఎఫ్(PPF Scheme). ఇది పోస్టాఫీసులో ఉంది. సేవింగ్స్ ప్లాన్ ప్రకారం మెచ్యూరిటీ వచ్చాక భారీ మొత్తంలో రిటర్న్స్ లభిస్తాయి.
ఈ మెచ్యూరిటీ పీరియడ్ ఒక ఏడాది నుంచి 15 ఏళ్ల పాటు ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అత్యంత లాభదాయకమైనది. వార్షిక లెక్కన చూసుకుంటే ఇందులో పెట్టుబడి పెడితే కనీసం 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.
15 ఏళ్ల తర్వాత గడువు ముగిసినా మరో 5 ఏళ్లకు పెంచుకోవచ్చు. ఏటా గరిష్టంగా 1.50 లక్షలు జమ చేసేందుకు వీలుంది ఈ పథకంలో. ఒకవేళ ఏడాదికి కాకుండా నెలకు పొదుపు చేయాలని అనుకుంటే రూ. 12,500 జమ చేయాల్సి ఉంటుంది.
ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయం పన్ను చట్టం 80 సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. 15 ఏళ్లలో రూ. 22.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 18 లక్షల వడ్డీ లభిస్తుంది.
Also Read : వచ్చే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ 350