IPL 2022 Ceremony : ముగింపు వేడుకల్లో రెహమాన్ సందడి
క్లోజింగ్ సెర్మనీకి భారీ ఎత్తున ఏర్పాట్లు
IPL 2022 Ceremony : గత రెండు నెలలుగా అలరిస్తూ వచ్చిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 ఆదివారంతో పూర్తవుతుంది. దాంతో
భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ) భారీ ఎత్తున ముగింపు వేడుకలను(IPL 2022 Ceremony) ఏర్పాటు చేసింది.
మరో వైపు ఫైనల్స్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ , రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు కొనసాగనుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో కొనసాగుతుంది ఈ గేమ్.
లక్షా 10 వేల మందికి పైగా ఈ స్టేడియంలో మ్యాచ్ ను చూడనున్నారు. ఇక ఈ ఐపీఎల్ 15వ సీజన్ కు ప్రధాన ఆకర్షణ గా నిలుస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు అల్లా రఖా (ఏఆర్) రెహమాన్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ , గాయనీ గాయకులు, నటులు పాల్గొంటారు.
ప్రేక్షకులను , క్రికెట్ ప్రియులను అలరింప చేస్తారు. అంతే కాకుండా గుజరాత్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు భారత దేశ
దీంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర బాఘేల్ తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులంతా ప్రస్తుతం అహ్మదాబాద్ లో ఉన్నారు.
ఎందుకంటే ఈ ఐపీఎల్ ఫైనల్స్ కు మ్యాచ్ కు ప్రధాన అతిథిగా దేశ ప్రధాని మోదీ హాజరు కానున్నారు. దీంతో రాష్ట్ర సర్కార్ , కేంద్ర హోం శాఖ
పూర్తిగా అహ్మదాబాద్ పై ఫోకస్ పెట్టింది.
ఏకంగా 6,000 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు సిటీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇక రెహమాన్ కచేరి ఉండనుంది.
వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన జానపద నృత్యకారులు కూడా ఇందులో పాల్గొంటారు.
భారత దేశ 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలతో 45 నిమిషాల ముగింపు వేడుకలను నిర్వహిస్తోంది బీసీసీఐ. ఈ ఈవెంట్ ను నిర్వహంచే
కాంట్రాక్టును టీసీఎం డైరెక్టర్ చందా సింగ్ పొందారు.
Also Read : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు మోదీ