Record Modi Stadium : చరిత్ర సృష్టించిన మోదీ స్టేడియం
లక్షకు పైగా ప్రేక్షకులు హాజరు
Record Modi Stadium : అరుదైన ఘనతను సాధించింది గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియం(Record Modi Stadium). ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 ఫైనల్ మ్యాచ్ కు ఏకంగా 1,04, 859 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.
ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ల కంటే అత్యధికంగా హాజరు కావడం విశేషం. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో హాజరైన ప్రేక్షకులకు సంబంధించి అరుదైన రికార్డు క్రియేట్ చేసింది మోదీ క్రీడా మైదానం(Record Modi Stadium).
గుజరాత్ టైటాన్స్ , రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అంతకు ముందు క్వాలిఫయిర్ -2 మ్యాచ్ కు కూడా లక్షకు పైగా జనం హాజరయ్యారు. ఇది కూడా ఓ చరిత్రే.
ఇక వినోద భరితమైన కార్యక్రమాలు కూడా అలరించాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ ను నిర్వహించింది.
లీగ్ మ్యాచ్ లు ముంబై, పుణెలో జరగగా, క్వాలిఫయిర్ -1 కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో , క్వాలిఫయిర్ -2, ఎలిమినేటర్ మ్యాచ్ లు అహ్మదాబాద్ వేదికగా జరిగింది.
ఈ ఫైనల్ మ్యాచ్ కు 6 వేల మందికి పైగా భద్రతా బలగాలను మోహరించారు. కోట్లాది రూపాయల ఆదాయం సమకూరింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ప్రధాన అతిథిగా హాజరయ్యారు.
బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా విజేతలకు బహుమతులు అందజేశారు. ఇక చాంపియన్ గా నిలిచిన గుజరాత్ కు రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.
రన్నరప్ కు రూ. 12.5 కోట్లు దక్కాయి రాజస్తాన్ కు. రూ. 7 కోట్లు మూడో స్థానంలో నిలిచిన ఆర్సీబీకి దక్కగా రూ. 6.5 కోట్లు లక్నో జట్టు చేజిక్కించుకుంది.
Also Read : ఆరెంజ్ క్యాప్ విజేత బట్లర్