IPL 2022 Finals : ఆల్ రౌండ్ నైపుణ్యం అద్భుత విజ‌యం

గుజ‌రాత్ టైటాన్స్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్

IPL 2022 Finals : ఐపీఎల్ 2022 ఫైన‌ల్ ఆదివారం గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఆల్ రౌండ్ నైపుణ్యంతో గుజ‌రాత్ టైటాన్స్ నేరుగా ఫైన‌ల్(IPL 2022 Finals) కు చేరింది.

నిల‌క‌డ‌గా రాణిస్తూ అద్భుత విజ‌యాలు న‌మోదు చేస్తూ స‌త్తా చాటింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ . ఇక ఆల్ రౌండ్ నైపుణ్యానికి, అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసే జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే ఫైన‌ల్(IPL 2022 Finals) యుద్దంలో ఎవ‌రు జ‌గ‌జ్జేతగా నిలుస్తారనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఆట అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జం. ఇక జ‌ట్ల బ‌లా బ‌లాల విష‌యానికి వ‌స్తే గుజ‌రాత్ రాజ‌స్థాన్ కంటే కొంత బ‌లంగా కనిపిస్తోంది. కానీ టీ20లో ఏ టైం ఎవ‌రు ఆధిప‌త్యం చెలాయిస్తారో చెప్ప‌డం క‌ష్టం.

ఈసారి 15వ రిచ్ లీగ్ సీజన్ లో కొత్త‌గా ఎంట్రీ ఇచ్చింది హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని గుజరాత్ టైటాన్స్. 14 మ్యాచ్ లు ఆడింది. 10 మ్యాచ్ ల‌లో స‌త్తా చాటింది. 20 పాయింట్ల‌తో టాప్ లో నిలిచింది.

ఇక ఎలాంటి అంచ‌నాలు లేకుండానే బ‌రిలోకి దిగింది సంజూ శాంస‌న్ నాయ‌క‌త్వంలోని రాజ‌స్తాన్ రాయ‌ల్స్ . 14 మ్యాచ్ లు ఆడి 9 మ్యాచ్ ల‌లో

విజ‌యం సాధించింది. 18 పాయింట్లు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో 2వ స్థానంలో నిలిచింది.

ఇక గుజ‌రాత్ అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ మ్యాచ్ మ్యాచ్ కు వేరియేష‌న్ చూపిస్తూ దుమ్ము రేపుతోంది. రాజ‌స్తాన్ ప‌డుతూ లేస్తూ

ఫైన‌ల్ కు చేరింది.

విచిత్రం ఏమిటంటే గుజ‌రాత్ కు చెందిన 9 మంది ఆట‌గాళ్లు వేర్వేరుగా ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ లుగా ఎంపిక‌య్యారు. ఓపెన‌ర్ సాహా,

గిల్ ఫామ్ లో ఉన్నారు. కెప్టెన్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ఫేమ‌స్.

ఆఖ‌రులో వేలం పాట‌లో చోటు ద‌క్కించుకున్న మిల్ల‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగుతున్నాడు. బౌలింగ్ ప‌రంగా ష‌మీ, జూనియ‌ర్ య‌శ్ ద‌యాల్ ,

ర‌షీద్ ఖాన్ సూప‌ర్ బౌలింగ్ తో ఆక‌ట్టుకుంటున్నారు.

ఇక రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ప‌రంగా చూస్తే ఆ జ‌ట్టు బ్యాటింగ్ లో దుర్బేద్యంగా ఉంది. ప్ర‌ధానంగా ఇంగ్లాండ్ స్టార్ హిట్ట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్. మార‌థాన్

ఇన్నింగ్స్ తో మోత మోగిస్తున్నాడు.

ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించే స‌త్తా ఉన్నోడు. ఇక పానీ పూరీ కుర్రాడు య‌శ‌స్వి జైశ్వాల్, అల‌వోక‌గా సిక్స్ లు కొట్టే సంజూ శాంస‌న్ , జంకు లేకుండా ఆడే దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్,

మ్యాచ్ ను శాసించే సిమ్రోన్ హిట్ మైర్ , రియాన్ ప‌రాగ్, ఆర్. అశ్విన్ ఉన్నారు. ఇక బౌలింగ్ ప‌రంగా ప్రసిద్ద్ క్రిష్ణ‌, మెక్ కామ్ , ట్రెంట్ బౌల్ట్ , ఆర్. అశ్విన్, చాహ‌ల్ బౌలింగ్ లో రాణిస్తే గుజ‌రాత్ కు క‌ష్ట‌మే.

Also Read : గుజ‌రాత్ జోరు రాజ‌స్తాన్ జోష్

Leave A Reply

Your Email Id will not be published!