IPL 2022 Finals GT vs RR : గుజ‌రాత్ జోరు రాజ‌స్తాన్ జోష్

ఇరు జ‌ట్ల బ‌ల బ‌లాలు ఇవే

IPL 2022 Finals GT vs RR : ఐపీఎల్ 2022 తుది స‌మ‌రానికి పోరాడేందుకు గుజ‌రాత్ టైటాన్స్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్(IPL 2022 Finals GT vs RR) సిద్ద‌మ‌య్యాయి. రెండు జ‌ట్లు క్వాలిఫ‌యిర్ 1,2 స్థానాల్లో నిలిచాయి. చివ‌రికి ఫైన‌ల్ లో త‌ల‌ప‌డ‌డం విశేషం.

గ‌త 14 సీజ‌న్ ల‌లో కంటే ఈసారి అనూహ్య‌, ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఫైన‌ల్ సంద‌ర్భంగా భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

దీంతో మ్యాచ్ అరగంట ఆల‌స్యంగా ప్రారంభం కానుంది. ఎప్ప‌టి లాగే రాత్రి 7.30 గంట‌ల‌కు బ‌దులు రాత్రి 8 గంట‌ల‌కు స్టార్ట్ అవుతుంది. ఇరు జ‌ట్ల కెప్టెన్లు సంజూ శాంస‌న్, హార్దిక్ పాండ్యాల‌కు ఇదే మొద‌టిసారి అవుతుంది టైటిల్ గెల‌వ‌డం.

ఇద్ద‌రూ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల నుంచి వ‌చ్చిన వాళ్లే. క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్న వాళ్లే. అందుకే క‌ష్టం అంటే ఏమిటో తెలుసు కాబ‌ట్టి

వారిద్ద‌రూ నేల విడిచి సాము చేయ‌లేదు.

అందుకే ఆయా జ‌ట్ల యాజ‌మాన్యాలు ఏరికోరి కెప్టెన్లుగా బాధ్య‌త‌లు అప్ప‌గించాయి. ఇక జ‌ట్ల విష‌యానికి వ‌స్తే గుజ‌రాత్ జోరు మీదుంది.

రాజ‌స్తాన్ జోష్ మీదుంది.

ఇరు జ‌ట్లు విజ‌యం కోసం స‌ర్వ శ‌క్తులు ప్ర‌ద‌ర్శించ‌డం ఖాయం. దీంతో కోట్లాది క్రికెట్ ప్రేమికుల‌కు ఇది పండ‌గేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

యావ‌త్ ప్ర‌పంచం వీరి పోరు కోసం ఎదురు చూస్తోంది.

లీగ్ ద‌శ‌లో 10 విజ‌యాల‌తో గుజ‌రాత్ టాప్ లో ఉండ‌గా రాజ‌స్తాన్ 9 గెలుపుల‌తో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండు

మ్యాచ్ లు జ‌రిగితే గుజ‌రాత్ దే పై చేయిగా మారింది.

గుజ‌రాత్ ఆల్ రౌండ్ నైపుణ్యంతో స‌త్తా చాటింది. కెప్టెన్ పాండ్యా ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు ఒక‌టి నుంచి 9వ స్థానం దాకా బ్యాటింగ్

చేసే ఆట‌గాళ్లు ఉండ‌డం గుజ‌రాత్ కు ప్ల‌స్ పాయింట్.

అంతే కాదు బౌలింగ్ ప‌రంగా చూస్తే అటు పేస‌ర్లు ఇటు స్పిన్న‌ర్లు మ్యాచ్ ను తిప్పేయ‌గ‌లిగిన స‌మ‌ర్థులు ఉన్నారు.

Also Read : యుద్ధానికి సిద్ధం స‌మ‌రానికి స‌న్న‌ద్ధం

Leave A Reply

Your Email Id will not be published!