No Ball Issue IPL : నో బాల్ వ్య‌వ‌హారంపై ఐపీఎల్ సీరియ‌స్

రిష‌బ్ పంత్..శార్దూల్ ఫీజుపై కోత ఆమ్రేపై నిషేధం

No Ball Issue IPL : ఐపీఎల్ 2022 రిచ్ టోర్నీలో భాగంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య లీగ్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో రాజ‌స్థాన్ 15 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

అయితే మ్యాచ్ కు సంబంధించి ఆఖ‌రు ఓవ‌ర్ లో ఓడెమ్ బౌలింగ్ లో వ‌రుస‌గా ఢిల్లీ ప్లేయ‌ర్ పావెల్ మూడు సిక్స‌ర్లు కొట్టాడు. అయితే మూడో బాల్ భుజం మీద‌కు వ‌చ్చిందని , దానిని నో బాల్(No Ball Issue IPL) ప్ర‌క‌టించాలంటూ డిమాండ్ చేశారు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ పంత్ .

అత‌డికి మ‌ద్ద‌తుగా శార్దూల్ నిలిచాడు. ఆపై ఆడ వ‌ద్దంటూ బ్యాట‌ర్ల‌ను వెన‌క్కి పిలిచాడు పంత్. ఇదే స‌మ‌యంలో నో బాల్ ప్ర‌క‌టించ‌ని అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు ప్ర‌వీణ్ ఆమ్రే. స‌ర్ది చెప్పేందుకు య‌త్నించినా ప‌ట్టించు కోలేదు.

దీంతో ఐపీఎల్ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ సీరియ‌స్ అయ్యింది. విచిత్రం ఏమిటంటే ఐసీసీ రూల్స్ (No Ball Issue IPL)ప్ర‌కారం అవుట్ కానీ లేదా ఎల్ బి డ‌బ్ల్యూ, ర‌నౌట్ విష‌యంలో థర్డ్ అంపైర్ రివ్యూ చూసి డెసిష‌న్ తీసుకునే చాన్స్ ఉంటుంది.

కానీ నో బాల్ విష‌యంలో అంతిమ నిర్ణ‌యం అంపైర్ దే అవుతుంది. ఈ విష‌యం తెలుసు కోకుండా పంత్ ఓవ‌ర్ యాక్ష‌న్ చేశాడు. దీనిని సీరియ‌స్ గా ప‌రిగ‌ణించిన పంత్ పై 100 శాతం ఫీజులో కోత‌, మ‌ద్ద‌తు ఇచ్చిన శార్దూల్ కు ఫీజులో 50 శాతం విధించింది.

అంతే కాదు మ్యాచ్ మ‌ధ్య‌లో వెళ్లి అంపైర్ తో గొడ‌వ‌కు దిగిన కోచ్ ప్ర‌వీణ్ ఆమ్రేపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది.

Also Read : స‌న్ రైజ‌ర్స్ స్పీడ్ చాలెంజ‌ర్స్ జోష్

Leave A Reply

Your Email Id will not be published!