IPL 2023 Playoffs Race : ప్లే ఆఫ్ రేస్ లో నువ్వా నేనా

ఈసారైనా ఆర్సీబీ క‌ల నెర‌వేరేనా

IPL 2023 Playoffs Race : బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఐపీఎల్ 16వ సీజ‌న్ ఇప్ప‌టికే ముగిసింది. ఇంకా స‌గం ఆడాల్సి ఉంది. ఇప్ప‌టి దాకా అన్ని జ‌ట్లు దాదాపు 7 మ్యాచ్ ల చొప్పున ఆడాయి. దీంతో ఏయే జ‌ట్లు ప్లే ఆఫ్స్ కు(IPL 2023 Play Off Race) చేరుకుంటాయ‌నే దానిపై ఫ్యాన్స్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.

ఆరంభంలోనే నిరాశ ప‌ర్చినా ఆ త‌ర్వాత పుంజుకుంది ధోనీ సేన‌. ప్ర‌ధానంగా ఆ జ‌ట్టులో ర‌హానే దుమ్ము రేపుతున్నాడు. ఇక మిగ‌తా జ‌ట్ల ప‌రంగా చూస్తే గుజ‌రాత్ టైటాన్స్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్ సైతం రేసులో ఉన్నా ఆ త‌ర్వాత జ‌రిగే మ్యాచ్ ల‌లో గెలుపు ఓట‌ముల‌పై పాయింట్ల ప‌ట్టిక‌లో స్థానాలు మార‌నున్నాయి. ఇప్ప‌టి దాకా చెన్నై టాప్ లో కొన‌సాగుతోంది.

ఇక ఎలాగైనా ఈసారైనా ఐపీఎల్ టైటిల్ కొట్టాల‌ని ఉవ్విళ్లూరుతోంది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB). కానీ ఆ జ‌ట్టు ఆశ‌ల‌పై కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నీళ్లు చ‌ల్లింది. ఇక ప్లే ఆఫ్ చేరుకోవాలంటే ప్ర‌తి జ‌ట్టు 8 లేదా 9 మ్యాచ్ లు గెలవాల్సి ఉంటుంది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ , స‌న్ రైజ‌ర్స్ , కోల్ క‌తా, ముంబై ఇండియ‌న్స్ టీమ్ లు అద్భుతాలు జ‌రిగితే త‌ప్ప ప్లే ఆఫ్ కు చేరుకునే ప‌రిస్థితి లేదు. చెన్నై, గుజ‌రాత్, రాజ‌స్థాన్ , ల‌క్నో, పంజాబ్ , ఆర్సీబీ పాయింట్ల జాబితాలో కంటిన్యూగా ఉన్నాయి. ప్లే ఆఫ్ లో కేవ‌లం 4 జ‌ట్లు మాత్ర‌మే ఉంటాయి.

Also Read : చెన్నై చెల‌రేగేనా రాజ‌స్థాన్ ర‌ఫ్పాడించేనా

Leave A Reply

Your Email Id will not be published!