IPL Auction Sam Curran : సామ్ కరన్ ఐపీఎల్ వేలంలో కమాల్
రికార్డు ధరకు పలికిన స్టార్
IPL Auction Sam Curran : ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం పాటలో చరిత్ర సృష్టించాడు సామ్ కరన్. ఏకంగా రూ. 18.50 కోట్లకు అమ్ముడు పోయాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ దక్కించుకుంది. కేరళ లోని కొచ్చిలో శుక్రవారం వేలం పాట జరుగుతోంది. రికార్డు స్థాయిలో ధరకు పలకడం విస్తు పోయేలా చేసింది.
ఇక విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ రూ. 16 కోట్లకు పలికాడు. ఇతడిని లక్నో సూపర్ జెయింట్స్ ఓన్ చేసుకుంది. ఇక ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ గా పేరొందిన బెన్ స్టోక్స్ ను రికార్డు స్థాయిలో చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకుంది. అతడిని రూ. 16.25 కోట్లకు కైవసం చేసుకుంది.
ఇక సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెస్ ను రూ. 5.25 కోట్లకు , ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ను రూ. 2 కోట్లకు తీసుకుంది. ఇక గుజరాత్ టైటాన్స్ కీవీస్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ను రూ. 2 కోట్లకు తీసుకుంది. ఆసిస్ ప్లేయర్ రిచర్డ్సన్ ను రూ. 1.50 కోట్లకు ముంబై ఇండియన్స్ కైవసం చేసుకోగా ఫిల్ సాల్ట్ ను రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
ఇక రీస్ టోప్లేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 1.9 కోట్లకు తీసుకుంది. ఇండియన్ స్టార్ బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ ను రూ. 50 లక్షలకు చేజిక్కించుకు లక్నో సూపర్ జెయింట్స్ . ఇషాంత్ శర్మను రూ. 50 లక్షలకు తీసుకుంది ఢిల్లీ.
ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలో అత్యధిక ధర సామ్ కరన్(IPL Auction Sam Curran) కాగా ఆసిస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను ముంబై ఇండియన్స్ ఏకంగా రూ. 17.50 కోట్లకు తీసుకుంది.
Also Read : రాణించిన పంత్..అయ్యర్
FIFA World Rankings 2022 : ప్రపంచ ర్యాంకింగ్స్ లో మెస్సీ సేన