IPL BCCI : ఐపీఎల్ ఆట కాదు అక్ష‌య‌పాత్ర‌

బీసీసీఐ గ‌ల్లా పెట్టె నిండా కోట్లే

IPL BCCI : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) ఏ ముహూర్తాన ప్రారంభించారో తెలియ‌దు కానీ ప‌ట్టింద‌ల్లా బంగారంగా మారుతోంది. ప్ర‌పంచంలో ఏ క్రీడా సంస్థ సాధించ‌ని కోట్లాది రూపాయ‌ల్ని కొల్ల‌గొడుతోంది.

స్పాన్స‌ర్ షిప్, బ్రాండ్ వాల్యూ, వేలం పాట‌, ప్ర‌సార హ‌క్కులు ఇలా ప్ర‌తి దాంట్లో ఐపీఎల్ కు కోట్లు వ‌చ్చి చేరుతున్నాయి. వ‌చ్చే ఐదేళ్ల‌లో ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల కోసం బీసీసీఐ(IPL BCCI) బిడ్ దాఖ‌లు చేయ‌నుంది.

బ‌హుశా రూ. 50,000 కోట్లు రానున్నాయ‌ని అంత‌కంటే ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు బీసీసీఐ(BCCI) చీఫ్ సౌర‌వ్ గంగూలీ. గ‌త ఏడాది వ‌ర‌కు చైనా స్మార్ట్ మొబైల్స్ త‌యారీ సంస్థ వివో అధికారిక స్పాన్స‌ర్ గా ఉండింది.

కానీ ఈసారి ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్(IPL)  2022ను ప్ర‌ముఖ భార‌తీయ దిగ్గ‌జ సంస్థ టాటా గ్రూప్ స్వంతం చేసుకుంది. ఆ సంస్థ చైర్మ‌న్ ర‌త‌న్ టాటా ప‌క్కా భార‌తీయుడు.

ఆయ‌న కావాల‌ని ఐపీఎల్ ను చేజిక్కించుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాని బ్రాండ్ వాల్యూ రోజు రోజుకు పెరుగుతోంది. దీని దెబ్బ‌కు క్రికెట్

అంటే పిచ్చివాళ్లు ఆడేది అంటూ గేలి చేసి, ఎగ‌తాళి చేసిన అమెరికా సైతం ఇప్పుడు ఐపీఎల్ వైపు మొగ్గు చూప‌తోంది.

అంటే అర్థం దానికి ఉన్న స‌త్తా ఏపాటిదో అర్థం చేసుకోవ‌చ్చు. అమెరికా స్టార్ ఆట‌గాళ్లు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీంలో పెట్టుబ‌డి పెట్టారంటే అర్థం చేసుకోవ‌చ్చు.

దాని ప‌వ‌ర్ ఎలాంటిదో. అన‌ధికార అంచ‌నా ప్ర‌కారం రూ. 10, 000 కోట్ల‌కు పైగానే ఐపీఎల్ క‌వ‌ర్ చేసింద‌ని టాక్. ఐపీఎల్ ను 2007లో

ఏర్పాటు చేసింది బీసీసీఐ. ప్ర‌తి ఏటా మార్చి లేదా మే నెల‌ల్లో నిర్వ‌హిస్తారు ఈ రిచ్ లీగ్ ను.

ఐపీఎల్ లీగ్ వ‌ర‌ల్డ్ వైడ్ గా మోస్ట్ పాపుల‌ర్ లీగ్ జాబితాలో 6వ స్థానంలో ఉంది. ఈసారి అది మ‌రింత ముందుకు వెళ్లే చాన్స్ ఉంది.

2010లో యూట్యూబ్ లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన మొద‌టి క్రీడా ఈవెంట్ గా ఐపీఎల్ నిలిచింది.

డ‌ఫ్ అండ్ ఫెల్స్ ప్ర‌కారం 2019లో ఐపీఎల్(IPL) బ్రాండ్ వాల్యూ రూ. 47, 500 కోట్లు . ఈసారి అది కాస్తా రూ. 50,000 కోట్ల‌ను దాట‌నుందని అంచ‌నా. బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో ఉన్న‌ప్ప‌టికీ దీనికి ప్ర‌త్యేక కౌన్సిల్ ఉంది.

ఐపీఎల్ టోర్నీకి సంబంధించి ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటైంది. దీనికి చైర్మ‌న్ గా బ్రిజేష్ ప‌టేల్ , జే షా గౌర‌వ కార్య‌ద‌ర్శిగా, అరుణ్

సింగ్ ధుమాల్ గౌర‌వ కోశాధికారిగా ఉన్నారు.

వీరితో పాటు ఖైరుల్ జ‌మాల్ మ‌జుందార్ స‌భ్యుడిగా, ప్ర‌జ్ఞాన్ ఓజా ఐసీఏ ప్ర‌తినిధిగా, అల్కా రెహానీ భ‌ర‌ద్వాజ్ కాగ్ నామినీగా ఉన్నారు.

Also Read : ప్లే ఆఫ్స్ లో స‌త్తా చాటేదెవరు

Leave A Reply

Your Email Id will not be published!