Sourav Ganguly : ఐపీఎల్ కు భారీ ఆదాయం పక్కా – గంగూలీ
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కంటే బెటర్
Sourav Ganguly : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) సంచలన కామెంట్స్ చేశాడు. ప్రపంచంలోనే అత్యధిక జనాదరణ కలిగిన లీగ్ లలో ఐపీఎల్ కూడా చేరబోతోందన్నాడు.
ఇది ఊహించని రీతిలో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) కు డిమాండ్ పెరిగిందన్నాడు. 600 మిలియన్ల మంది ఏకకాలంలో చూస్తున్న ఆటగా దీనికి పేరుందని చెప్పాడు.
ఇంగ్లీష్ ప్రిమీయర్ లీగ్ కంటే ఐపీఎల్ ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తోందని తెలిపాడు. ఇది ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ రికార్డుగా పేర్కొన్నాడు.
తాను ఎక్కువగా అభిమానించే క్రికెట్ అభివృద్ది చెందడం తనకు సంతోషం కలిగిస్తోందని అన్నాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న స్పోర్ట్స్ టోర్నీలలో ఐపీఎల్ కూడా ఒకటి అని స్పష్టం చేశాడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly).
ఈ లీగ్ కు భారీ ఎత్తున ఆదరణ వస్తోందన్నారు. క్రికెట్ చరిత్రలో ఐపీఎల్ ఇది అద్భుతమని పేర్కొన్నాడు. నాలాంటి ఆటగాళ్లు ఆడిన సమయంలో కంటే ఇప్పుడు ఆటగాళ్ల ఆదాయం కోట్లల్లో ఉంటోందన్నాడు.
ఇది మంచి పరిణామమని తెలిపాడు గంగూలీ. ఈ దేశంలో క్రికెట్ అంటే ఓ మతంగా భావిస్తారని అన్నాడు. రోజు రోజుకు ఐపీఎల్ కు మరింత ఆదరణ పెరగడం ఖాయమన్నారు.
ఇండియా లీడర్ షిప్ కౌన్సిల్ లో సిఇఓ దీపక్ లాంబాతో జరిగిన సంభాషణలో మాట్లాడారు. నాయకుడిగా ఈ దేశ జట్టుకు విజయాలు సాధించి పెట్టడం ఆనందంగా ఉందన్నాడు.
మొత్తంగా నా కెరీర్ లో దిగ్గజ ఆటగాళ్లతో ఆడాను. వారిలో ప్రత్యేకంగా చెప్పు కోవాల్సింది మహమ్మద్ అజహరుద్దీన్ , సచిన్, ద్రవిడ్ తో తాను ఏనాడూ పోటీ పడ లేదని చెప్పాడు సౌరవ్ గంగూలీ.
Also Read : అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు