IPL BCCI : భార‌త్ లో ఐపీఎల్ ఆట కాదు ఓ మ‌తం

బ్లూమ్ బ‌ర్గ్ తో బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా

IPL BCCI : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఐపీఎల్ జ్వ‌రం ప‌ట్టుకుంది. అది క్రికెట్ ఆట కాద‌ని ఓ మ‌తం అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో ఐపీఎల కు ఉన్నంత ఆద‌ర‌ణ ఇంకే క్రికెట్ ఫార్మాట్ కు లేక పోవ‌డం విశేషం.

వేలాది కోట్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)(IPL BCCI) ఆదాయం రూపేణా స‌మ‌కూరుతోంది. ఇప్ప‌టి దాకా పురుషుల ఐపీఎల్ చేప‌ట్టింది. 2008లో ప్రారంభ‌మైన ఈ రిచ్ మెగా లీగ్ ఇప్పుడు అక్ష‌య‌పాత్ర‌గా మారింది.

10 జ‌ట్లు పాల్గొంటున్నాయి. ఈసారి బీసీసీఐ మ‌హిళ‌ల ఐపీఎల్(IPL BCCI) చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. ఇక ఐపీఎల్ 5 ఏళ్ల‌కు సంబంధించి ప్ర‌సార హ‌క్కుల‌కు బిడ్డంగ్ ఇవ్వ‌నుంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా మీడియా సంస్థ‌లు పెద్ద ఎత్తున పోటీ ప‌డుతున్నాయి. లైవ్ కాస్ట్ , స్ట్రీమింగ్ కు సంబంధించి దాదాపు రూ. 50,000 వేల కోట్ల రూపాయ‌లు రావ‌చ్చ‌ని అంచ‌నా. ఇదే విష‌యాన్ని బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా వెల్ల‌డించారు.

గేమ్ ప్లాన్ వ్యాపారంతో కూడుకుని ఉన్న‌ది. ఐపీఎల్ ను ప్ర‌పంచంలో అత్య‌ధికంగా వీక్షించే ఈవెంట్ గా మార్చాల‌ని, మ‌రింత లాభదాయ‌కంగా, వైవిధ్య భ‌రితంగా చేయాల‌ని చూస్తున్నారు.

వ‌చ్చే ఏడాది 2023లో ఉమెన్స్ ఐపీఎల్ రిచ్ లీగ్ చేప‌ట్టాల‌ని నిర్ఱ‌యించింది బీసీసీఐ(IPL BCCI) పాల‌క మండ‌లి. ఇందులో ఆరు జ‌ట్లు పాల్గొంటాయి. బ్లూమ్ బెర్గ్ తో జే షా మాట్లాడుతూ వెల్ల‌డించారు.

పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీల య‌జ‌మానులు మ‌హిళ‌ల లీగ్ జ‌ట్ల‌కు కూడా వేలం వేయ‌నున్నారు. మ‌హిళల ఆట ప‌ట్ల కూడా ఆద‌ర‌ణ పొందేలా చూడాల‌ని అనుకుంటోంది.

ఐపీఎల్ $7 బిలియ‌న్ల విలువైన‌దిగా అంచ‌నా వేశారు. గ‌త ఏడాది 600 మిలియ‌న్ల మంది వీక్ష‌కుల‌ను ఆక‌ర్షించింది. బీసీసీఐ అంచ‌నాల ప్ర‌కారం ఈసారి ప్ర‌సార హ‌క్కులు ఊహించ‌ని దానికంటే ఆదాయం స‌మ‌కూర‌నుంది.

జూన్ లో జ‌రిగే పురుషుల లీగ్ ప్ర‌సార హ‌క్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో, వాల్ట్ డిస్నీ, సోని గ్రూప్ కార్పొరేష‌న్ (జీ మీడియా ) తో పాటు ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ పోటీ ప‌డ‌నున్నాయి.

వేలం పాట ద్వారా రూ. $ 5 బిలియ‌న్ల కంటే ఎక్కువ బిడ్ ల‌ను డ్రా చేసే అవ‌కాశం ఉంది. ఈ దేశంలో ప్ర‌తి గ‌ల్లీ గ‌ల్లీలో క్రికెట్ కు ఆద‌ర‌ణ ఉన్నంత కాలం ఐపీఎల్ కు డిమాండ్ త‌గ్గ‌దు.

అమెజాన్, వ‌యాకామ్ 18 మీడియా బిడ్డింగ్ కు సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఐపీఎల్ కు హెవీ ఆద‌ర‌ణ ఉంది. దాంతో బీసీసీఐ బేస్ ధ‌ర‌ను మ‌రింత పెంచింది.

షా అంచ‌నా ప్ర‌కారం సౌదీ అరేబియా ఆయిల్ కో నుండి టాటా గ్రూప్ తో స‌హా 2022 మ్యాచ్ ల కోసం అన్ని స్పాన్స‌ర్ షిప్ స్లాట్ ల‌ను పొందింది బీసీసీఐ. క్రీడా ప్ర‌పంచంలో 80 శాతం వాటాను బీసీసీఐ క‌లిగి ఉంది.

 

Also Read : ఉత్కంఠగా మారిన ప్లే ఆఫ్స్

Leave A Reply

Your Email Id will not be published!