IPL Mega Auction : ఐపీఎల్ మెగా వేలం 2024 వేదిక, తేదీలపై కీలక అప్డేట్
ఇక వేలం నిర్వహణ వేదిక, తేదీలపై తొలిసారి ఒక కథనం వెలువడింది...
IPL : ఐపీఎల్ మెగా వేలం-2025 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వేలంలో ఏ క్రికెటర్ ఎంత ధర పలకబోతున్నాడు? ఏయే జట్లు ఎవరెవరిని దక్కించుకోనున్నాయి?. కొత్తగా రికార్డులు ఏమైనా బద్దలవుతాయా? అనే ఆసక్తికర చర్చలు క్రికెట్ ఫ్యాన్స్‌లో మొదలయ్యాయి. దీనికి తోడు ఇటీవల ఫ్రాంచైజీలన్నీ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించడంతో వేలంలో అందుబాటులో ఉండబోయే ఆటగాళ్లు ఎవరనేది క్లారిటీ వచ్చింది. దీంతో వేలంపై ఆసక్తి మరింత పెరిగింది.
IPL Mega Auction Updates
ఇక వేలం నిర్వహణ వేదిక, తేదీలపై తొలిసారి ఒక కథనం వెలువడింది. ఈ ఏడాది ఐపీఎల్(IPL) మెగా వేలం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో నిర్వహించే అవకాశం ఉందని జాతీయ మీడియా వార్త సంస్థ ఏఎన్ఐ కథనం వెల్లడించింది. నవంబర్ 24, 25 తేదీలలో వేలం ఉండొచ్చని పేర్కొంది. మరి ఈ తేదీలే ఫైనల్ అవుతాయా? లేక ఏమైనా మార్పులు ఉంటాయా అనేది వేచిచూడాల్సిందే. గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లతో కూడిన టీమ్‌ను రూపొందించుకోవాలని జట్లు భావిస్తున్నాయి. కాబట్టి వేలం ప్రక్రియ రెండు రోజులపాటు కొనసాగనుంది.
ఈసారి వేలం పాటలో స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతారనే అంచనాలు నెలకొన్నాయి. వీరితో పాటు ఫాఫ్ డు ప్లెసిస్, డేవిడ్ మిల్లర్, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కర్రాన్, సికందర్ రజా, కగిసో రబడ, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లపై కూడా జట్లు కన్నేసి ఉంచే అవకాశం ఉంది. ముఖ్యంగా రిషబ్ పంత్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రికార్డు ధర పలకవచ్చనే విశ్లేషణలు ఊపందుకున్నాయి.
కాగా ఫ్రాంచైజీలు అన్నీ అక్టోబర్ 31న తమ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా జట్లు రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) స్టార్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్‌కు యాజమాన్యం ఏకంగా రూ.23 కోట్లు కట్టబెట్టి రిటెయిన్ చేసుకుంది. ఇక విరాట్ కోహ్లీని రూ.21 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలుపుదల చేసుకుంది. మొత్తం పది జట్లు కలిపి 46 మంది ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్నాయి. అందులో 36 మంది ఇండియన్ క్రికెటర్లు, కాగా 10 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్ల కోసం జట్లు అన్నీ ఉమ్మడిగా రూ.558.5 కోట్లు వెచ్చించినట్టు అయింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) – పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్.
చెన్నై సూపర్ కింగ్స్– రుతురాజ్ గైక్వాడ్, మతీశ పతిరణ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ.
ఢిల్లీ క్యాపిటల్స్ – అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్.
గుజరాత్ టైటాన్స్ – రషీద్ ఖాన్, శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్.
కోల్‌కతా నైట్ రైడర్స్ – రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్ర్యూ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్– నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహిసిన్ ఖాన్, ఆయుష్ బడోని.
ముంబై ఇండియన్స్ – జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ.
పంజాబ్ కింగ్స్ – శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్.
రాజస్థాన్ రాయల్స్ – సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు– విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్.
Also Read : Minister Vasamshetty : వైసీపీ నేతలపై భగ్గుమన్న మంత్రి వాసంశెట్టి సుభాష్