Iran President : ఇజ్రాయెల్ పై హెచ్చరికలు జారీచేసిన ఇరాన్ అధినేత ఎక్స్ పై వేటు

ఇటీవల ఇజ్రాయెల్ క్షిపణులతో ఇరాన్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే...

Iran President : ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్‌కు తీవ్ర హెచ్చరికలు చేసినందుకు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమైనీ(Ali Khamenei)కి చెందిన అకౌంట్‌పై సోమవారం వేటు పడింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఖమైనీ అకౌంట్‌ను సస్పెండ్ చేసినట్టు ఎక్స్ పేర్కొంది. అలీ ఖమైనీకి ఎక్స్‌లో పలు అకౌంట్లు ఉండగా హీబ్రూ భాషలో పోస్టులు పెట్టేందుకు ఉపయోగించే అకౌంట్‌పై తాజా వేటు పడింది.

Iran President ‘X’ Account..

ఇటీవల ఇజ్రాయెల్ క్షిపణులతో ఇరాన్‌(Iran)పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో, ఇజ్రాయెల్‌కు హెచ్చరిక చేస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ పోస్టు పెట్టారు. ‘‘ ఈ జయోనిస్టు పాలకులు తప్పు చేశారు. ఇరాన్‌ విషయంలో తప్పుడు అంచనా వేశారు. @Khamenei_Heb ,, ’’ దీంతో, ఈ అకౌంట్‌ను ఎక్స్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాగా, ఖమైనీకి ఉన్న ప్రధాన ఎక్స్ అకౌంట్ ద్వారా ఇంగ్లిష్‌లో ట్వీట్స్ పోస్టు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ ఇందులో హీబ్రూ భాషలోనూ స్పందిస్తుంటారు. అరబిక్ భాషలో స్పందించేందుకు ఆయనకు మరో అకౌంట్ కూడా ఉంది. ఇక ఖమైనీ మీడియా పేరిట ఉన్న అకౌంట్లో ఆయన మాట్లాడిన అంశాలు కనిపిస్తుంటాయి. ఇందులోని విషయాలను ఒక్కోసారి ఖమైనీ ఇంగ్లిష్ అకౌంట్ రీట్వీట్ కూడా చేస్తుంటుంది.

కాగా, శనివారం ఇరాన్ రాజనాని టెహ్రాన్ చుట్టుపక్కల ఉన్న పలు మిలిటరీ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో నలుగురు ఇరాన్ సైనికులు మృతి చెందారు. ఈ నెల మొదట్లో ఇరాన్ మిసైల్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడికి దిగింది. ఇరాన్ మిలిటరీ స్థావరాలు, మిసైల్ తయారీ కేంద్రాలపై తాము భీకర దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రధాని మీడియాతో వ్యాఖ్యానించారు.ఇది స్వల్పమైన దాడిగా తొలుత చెప్పుకొచ్చిన ఇరాన్ ఆ తరువాత రూట్ మార్చింది. జరిగిన నష్టాన్ని ఎక్కువ చేయడం లేదా తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదని ఇరాన్ సుప్రీం లీడర్‌ తన సైనిక జనరల్స్‌తో అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఇరాన్ శక్తి ప్రపంచానికి ప్రదర్శించాలని ఆయన సూచించినట్టు సమాచారం. ఆ తరువాత ఖమైనీ.. ఇజ్రాయెల్ తప్పిదానికి పాల్పడిందంటూ హీబ్రూ భాషలో పోస్టు పెట్టారు. ఈ క్రమంలోనే అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

Also Read : PM Modi : స్పెయిన్ ప్రధాని పెడ్రోతో కలిసి టాటా ఎయిర్ బస్ ను ప్రారంభించిన మోదీ

Leave A Reply

Your Email Id will not be published!