Irani Chai : ఇరానీ చాయ్ చాలా స్వీట్ గురూ
గుండెల్ని మీటుతున్న హైదరాబాద్
Irani Chai : హైదరాబాద్ అంటేనే ఇరానీ చాయ్ తో పాటు బిర్యానీ గుర్తుకు వస్తుంది. సుదీర్ఘ రాజకీయ పార్టీగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ అగ్ర
నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా మరోసారి తన మనసులో మాట బయట పెట్టారు.
ఇరానీ చాయ్ గురించి, దాని టేస్ట్ గురించి ప్రస్తావించారు. ఇవాళ అంతర్జాతీయ టీ దినోత్సవం. ఈ దేశంలో ఇరానీ చాయ్ తాగాలంటే ముందుగా
గుర్తుకు వచ్చేది నిజాములు ఏలిన తెలంగాణ. భాగ్యనగరంలో సామాన్యుల నుంచి పెద్దోళ్ల దాకా కేవలం ఇరానీ చాయ్,
బిస్కట్లతో బతికేయొచ్చు. సమోసాలు కూడా ఇక్కడ ఫేమస్. టేస్ట్ ఆఫ్ పర్షియాగా కూడా హైదరాబాద్ కు పేరుంది. తెలంగాణకు తలమానికంగా నిలిచింది ఇరానీ చాయ్.
పేదోళ్ల కు ఇది పరిచయమే. ఆకలి అయితే ఉస్మానియ బిస్కట్లు ఇరానీ చాయ్(Irani Chai) తాగాల్సిందే. ఒక్కసారి దీని రుచి చూశారంటే
ఇక వదలడం ఎవరి తరమూ కాదు.
అంత టేస్ట్ గా ఉంటుంది. తరాలు మారినా రాజులు మారినా, రాజ్యాలు మారినా, టెక్నాలజీ మారినా ఇరానీ చాయ్ మాత్రం మార లేదు. అలాగే కొనసాగుతూ వస్తోంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చారంటే చాలు ఈ చాయ్ ని తాగకుండా ఉండలేరు.
మనల్ని వెంటాడుతుంది. మన గుండెల్ని మరింత చిక్క బరిచేలా చేస్తుంది. ఇరానీ చాయ్ కి ఉన్న మహత్తు అలాంటిది. ఇక నగరంలో
ఎక్కడికి వెళ్లినా ఇరానీ చాయ్ , ఉస్మానియా బిస్కెట్లు దర్శనమిస్తాయి.
సామాన్యుల ఆకలిని తీర్చేవి ఇవే. అందుకే వాటికి ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ ధర మాత్రం అందరికీ అందుబాటులోనే ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అప్పుడెప్పుడో ఇరానీ నుంచి వచ్చిన ఈ పానియం ఇప్పుడు రాష్ట్రాన్ని శాసించే స్థాయికి చేరింది.
వందల కోట్ల వ్యాపారం ఈ ఇరానీ చాయ్(Irani Chai) తో జరుగుతోందంటే నమ్మగలమా. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు దీనిని దెబ్బ
కొట్టాలని చూశాయి. కానీ అవే అడ్రస్ లేకుండా పోయాయి.
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా ముందుగా అడిగేది..కావాలని కోరేది మాత్రం ఇరానీ చాయ్ నే. పర్షియా నుండి స్థిరపడిన
వారిచే పరిచయం చేయబడింది ఈ పానీయం.
ఇటీవల బారిస్టాస్ , కేఫ్ కాఫీ డేస్ వచ్చాక కొంత ప్రభావం పడినా ఇరానీ చాయ్ కు ఉన్న ఆదరణను తగ్గించ లేక పోయాయి.
పాత నగరం చుట్టూ , బేకరీలలో, టీ దుకాణాలలో ఎక్కడికి వెళ్లినా ఇరానీ చాయ్ పలకరిస్తుంది.
సికింద్రాబాద్ లోని లెజండరీ ప్యారడైజ్ తన తనం కోల్పోలేదు. ఈ చాయ్ ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. టీ ఆకులను నీటితో పాటు
ప్రత్యేక కంటైనర్ లో ఉడక బెడతారు. పాలు కూడా ప్రత్యేక కంటైనర్ లో ఉంచుతారు.
కస్టమర్లకు మొదట పాలు పోస్తారు. తర్వాత టీ ఆకులతో చేసిన దానిని కలుతారు. అర్ధరాత్రి నుంచి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు వెళ్లినా ఇరానీ చాయ్ రుచి మాత్రం మారదు.
Also Read : బతుకు పండాలంటే టీ తాగాల్సిందే