Irani Trophy 2022 : సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్
సెంచరీతో దుమ్ము రేపాడు
Irani Trophy 2022 : భారత క్రికెట్ యువ కిశోరం సర్ఫరాజ్ ఖాన్ సత్తా చాటాడు. మరోసారి సెంచరీతో మెరిపించాడు. ఇరానీ కప్(Irani Trophy 2022) లో సర్ఫరాజ్ ఖాన్ తన జోరు కొనసాగించాడు. సౌరాష్ట్రపై రెస్ట్ ఆఫ్ ఇండియా తరపున ఆడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో మరో సెంచరీతో రెచ్చి పోయాడు. సౌరాష్ట్ర 98 పరుగులే చేసింది.
ఈ తరుణంలో రెస్ట్ ఆఫ్ ఇండియా 18 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో మైదానంలోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఎక్కడా తగ్గలేదు. సౌరాష్ట్ర బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెప్టెన్ హనుమ విహారితో కలిసి బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ నాలుగో వికెట్ కు 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
విహారి ఓ వైపు వికెట్లను కాపాడుకునేలా ఆడితే సర్ఫరాజ్ ఖాన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. వన్డే తరహా ఆడాడు. మైదానం నలు దిక్కులా బౌలర్లను ఎదుర్కొన్నాడు. కళ్లు చెదిరేలా షాట్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు సర్ఫరాజ్ ఖాన్. అంతే కాదు వరుసగా టోర్నీల్లో 900 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక హిట్టర్ గా సర్ఫరాజ్ ఖాన్ చరిత్ర సృష్టించాడు.
అంతకు ముందు సీజన్ లో 982 రన్స్ చేశాడు. 2019-2020 రంజీ ట్రోఫీ సీజన్ లో సర్ఫరాజ్ ఖాన్ 928 పరుగులు సాధించాడు. తన చివరి 24 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ లలో 125 కంటే ఎక్కువ సగటుతో 2,200 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
ఇందులో 9 సెంచరీలు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అభిమానులు మాత్రం సర్ఫరాజ్ ఖాన్ ను బీసీసీఐ టెస్టు జట్టుకు ఎంపిక చేయాని కోరారు. మరో మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప సైతం ఖాన్ కింగ్ అంటూ కితాబు ఇచ్చాడు.
Also Read : ఫుట్ బాల్ మ్యాచ్ లో పెరిగిన మృతుల సంఖ్య