Irfan Pathan : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఇప్పుడు ఒకే ఒక్క బౌలర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతడే ఉమ్రాన్ మాలిక్. మొన్నటికి మొన్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అయితే ఇలాంటి బౌలర్ ను తాను ఎక్కడా చూడలేదన్నాడు.
మాలిక్ స్పెల్ లో ఆడేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఊహించని రీతిలో దెబ్బ కొట్టాడు. కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసి 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
దీంతో అతడి ప్రతిభా సామర్థ్యం మరింత వెలుగులోకి వచ్చింది. అత్యంత వేగవంతంగా బంతుల్ని విసరడంలో మనోడు దిట్ట. ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ఉమ్రాన్ మాలిక్ ను ఆకాశానికి ఎత్తేశాడు.
అద్భుతమైన బంతికి కేకేఆర్ స్కిప్పర్ శ్రేయాస్ అయ్యర్ ను పెవిలియన్ కు పంపించాడు. అతడిని తాజాగా ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ లో ఆడే భారత జట్టుకు ఎంపిక చేయాలని సూచించాడు.
150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ రికార్డు బ్రేక్ చేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కు ముందు జమ్మూ కాశ్మీర్ జట్టు శిబిరంలో యువ ఆటగాడిని మొదటిసారి చూశానని గుర్తు చేసుకున్నాడు ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan).
ఉమ్రాన్ మాలిక్ ను చూసిన ప్రతిసారి తనకు పాకిస్తాన్ కు చెందిన మాజీ స్టార్ పేసర్ వకార్ యూనిస్ ను గుర్తుకు వచ్చేలా చేశాడని కితాబు ఇచ్చారు ఇర్ఫాన్ పఠాన్. మెంటార్ గా కూడా వ్యవహరించా. అద్భుతంగా అనిపించిందంటూ పేర్కొన్నాడు.
Also Read : రోడ్డు ప్రమాదంలో టెన్నిస్ ప్లేయర్ మృతి