Irfan Pathan & Pandya : ఐపీఎల్ ఉత్తమ జట్టుకు అతడే కెప్టెన్
మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంచనా
Irfan Pathan & Pandya : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో జనాదరణ పొందిన ఐపీఎల్ మెగా రిచ్ లీగ్ ముగిసింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ లో హార్దిక్ పాండ్యా(Pandya) సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ పై ఘన విజయాన్ని నమోదు చేసింది.
మొదటిసారిగా ఐపీఎల్ 15వ సీజన్ లో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. టైటిల్ గెలిచి చరిత్ర నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాలలో రాణించింది.
జట్టుకు చెందిన ప్రతి ఆటగాడు శక్తియుక్తుల్ని ప్రదర్శించారు. రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ తో పాటు కప్ కూడా అందుకున్నారు. ప్రధానంగా
పాండ్యా(Irfan Pathan & Pandya) కెప్టెన్ గా ముందుండి నడిపించాడు.
తనకు ఎదురే లేదని చాటాడు. గత రెండు ఏళ్లుగా ఇబ్బందులు పడి, చివరకు జాతీయ జట్టుకు కూడా దూరమైన పాండ్యాకు ఐపీఎల్ ఓ వరంగా
మారింది. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ఏకంగా అతడిని ఏరికోరి ఎంపిక చేసింది.
కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. కోచ్ ఆశిష్ నెహ్రా, మెంటార్ గ్యారీ కిరిస్టెన్ మార్గదర్శకంలో గుజరాత్ దుమ్ము రేపింది. కథ ముగిసినా ఐపీఎల్ లో అత్యుత్తమ జట్టును ఓవర్ ఆల్ గా ప్రకటించాడు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan).
ఈ మేరకు ఈ టీమ్ కు కెప్టెన్ గా పాండ్యాను ఎంపిక చేశాడు. ఇక మిగతా ఆటగాళ్లు ఇలా ఉన్నారు. దీనికి ఐపీఎల్ 2022 బెస్ట్ ఎలెవన్ అని పేరు పెట్టాడు.
ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, జోస్ బట్లర్ ఉండగా వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ , హార్దిక్ పాండ్యా కెప్టెన్ , లివింగ్ స్టోన్ , డేవిడ్ మిల్లర్ , రషీద్ ఖాన్ ,
హర్షల్ పటేల్ , షమీ, చాహల్ , ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేశాడు. ఇక 12వ ఆటగాడిగా కుల్దీప్ యాదవ్ ను చేర్చాడు.
Also Read : ఆటలోనే కాదు వినయంలో గొప్పోడు