Hrithik Saba : హృతిక్ మ‌ళ్లీ డేటింగ్ చేస్తున్నాడా ?

స‌బా ఆజాద్ తో క‌నిపించిన న‌టుడు

Hrithik Saba : బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరొందిన హృతిక్ రోష‌న్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. ముంబై లోని ఓ ప్ర‌ముఖ జ‌ప‌నీస్ రెస్టారెంట్ లో స‌బా ఆజాద్ తో క‌నిపించ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

హృతిక్ రోష‌న్ గ‌త కొంత కాలం నుంచి ఆమెతో డేటింగ్ లో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. హృతిక్ రోష‌న్ త‌న‌తో క‌లిసి రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా మీడియా కంట ప‌డ్డారు.

ఆమెను త‌నే చేయి ప‌ట్టుకుని వెళ్ల‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. జ‌ర్న‌లిస్టులు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫ‌ర్లు హృతిక్ చేయి అడ్డు పెట్టాడు. ఆమెను వెహికిల్ లో కూర్చొనేంత దాకా తాను అడ్డంగా నిల‌బ‌డ్డాడు.

దీంతో ఎవ‌రీ స‌బా ఆజాద్(Hrithik Saba) అని, ఆమెకు హృతికి రోష‌న్ కు ఏంటి సంబంధం అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. ప్ర‌స్తుతం మాట్ టాపిక్ గా మారారు.

ఆమె మాస్క్ ధ‌రించి ఉండ‌డంతో ఎవ‌ర‌నే దానిపై కూపీ లాగ‌డం మొద‌లు పెట్టారు. దీంతో హృతిక్ రోష‌న్ ను వెంట‌నే రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌కు పంపించే ప్ర‌య‌త్నం చేశాడు.

కొంద‌రు ఆమె ప‌ష్మీన్ రోష‌న్ అని పేర్కొంట‌డ‌గా మ‌రికొంద‌రు ఆమె కాద‌ని స‌బా ఆజాద్ అంటూ పేర్కొన్నారు. ఆమె ఇటీవ‌ల న‌సీరుద్దీన్ షా త‌న‌యుడు ఇమాద్ తో క‌లిసి ప‌ని చేసిన యువ న‌టి.

ఇదిలా ఉండ‌గా హృతిక్ రోష‌న్ సుస్సానే ఖాన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత విడాకులు ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ఒంట‌రిగా ఉన్నాడు.

Also Read : పెళ్లి కాకుండానే విడాకులు ఎలా

Leave A Reply

Your Email Id will not be published!