Isha Ambani : ఇషా అంబానీ చేతికి రిలయన్స్ రిటైల్
కూతురికి ముఖేష్ అంబానీ బిగ్ పోస్ట్
Isha Ambani : రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ గా ఉన్న ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తనయుడు ఆకాష్ అంబానీకి రిలయన్స్ జియో సంస్థ చైర్మన్ గా నియమించిన వెంటనే కూతురు ఇషా అంబానీకి(Isha Ambani) కీలక పదవి అప్పగించారు.
ఆమె తాజాగా రిలయన్స్ రిటైల్ సంస్థ చైర్మన్ గా ఎంపికయ్యారు. ఇక నుంచి ఆమె తన తండ్రి ముఖేష్ అంబానీ వారసత్వ ప్రణాళికతో ముందుకు సాగనున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే ఇది బిగ్ పోస్ట్ . తనయుడు బాధ్యతలు చేపట్టాక ఇషా కొలువు తీరుతుందని ఎవరూ అనుకోలేదు.
దేశ వ్యాప్తంగా ఇప్పటికే రిటైల్ రంగంలో వాటా కలిగి ఉంది రిలయన్స్ రిటైల్ సంస్థ. భారతీయ బిలీయనీర్ ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబాలలో టాప్ లో ఉన్నారు.
ఇదే సమయంలో ఇషా అంబానీ రిలయన్స్ సంస్థల్లో బిగ్ యూనిట్ గా పేరొందింది రిలయన్స్ రిటైల్ సంస్థ. ఈ రిటైల్ యూనిట్ కు చైర్మన్ గా ఎంపికయ్యారు.
ప్రస్తుతం చైర్మన్ గా ఎంపికయ్యే కంటే ముందు ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ కు డైరెక్టర్ గా ఉన్నారు.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ , టెలికాం యూనిట్ చైర్మన్ గా ఎంపికయ్యాడు సోదరుడు ఆకాష్ అంబానీ. సోదరి ఇషా అంబానీ దానికి ధీటుగా ఎదుగుతున్న రిలయన్స్ రిటైల్ కు చీఫ్ గా ఎంపిక కావడం విశేషం.
ఇదిలా ఉండగా 30 ఏళ్ల వయస్సు ఉన్న ఇషా అంబానీ యేల్ యూనివర్శిటీలో చదువుకున్నారు.
Also Read : జియోకు ముఖేష్ అంబానీ రాజీనామా