Jaggi Vasudev Isha Mahashivratri 2023 : శివ నామ స్మరణం ఈషామయం
ఈషా ఫౌండేషన్ లో భక్త జన సందోహం
Jaggi Vasudev Isha Mahashivratri 2023 : మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తమిళనాడులోని కోయంబత్తూరులోని సద్గురు శ్రీ జగ్గీవాసుదేవన్ సారధ్యంలో ఈషా ఫౌండేషన్ లో అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు ఈషాకు చేరుకున్నారు. ప్రతి ఒక్కరు శివ శంకరా అంటూ నినదిస్తున్నారు. కళాకారులు తమ ప్రతిభకు మెరుగులు దిద్దుతూ శివుడి గొప్పతనం ఏమిటో చెబుతున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈషాకు చేరుకున్నారు. జై శివాయ శంకరాయ అంటూ పాటలు పాడుతున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవన్ (Jaggi Vasudev Isha Mahashivratri 2023) అశేష భక్తులను ఉద్దేశించి ఆడుతున్నారు..వారిని ఉత్తేజ పరుస్తూ ముందుకు సాగుతున్నారు.
శివరాత్రిని పురస్కరించుకుని దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా ఈషా ఫౌండేషన్ కు చేరుకున్నారు. ఆమెకు సాదర స్వాగతం పలికారు తమిళనాడు రాష్ట్రపతి ఆర్ఎన్ రవి. ఆమెను దగ్గరుండి తోడ్కొని ఈషా ఫౌండేషన్ లోకి తీసుకు వచ్చారు సద్గురు జగ్గీ వాసుదేవన్. ఫౌండేషన్ లో ఏర్పాటు చేసిన శివుడి విగ్రహానికి పూజలు చేశారు.
శివుడు దయ కలిగిన దేవుడు అంటూ కొనియాడారు. ప్రతి ఒక్కరిలో మానవతను బోధించి, మమతను కలిగించే సహృదయం కలిగిన నిర్వికారుడు అంటూ ప్రశంసించారు రాష్ట్రపతి. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తాను ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు.
దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వేలాది మందితో ఈషా ప్రాంగణం నిండి పోయింది. ఎక్కడ చూసినా సద్గురు, శివ నామ స్మరణలతో మారుమ్రోగింది.
Also Read : చైతన్యానికి ప్రతీక శివరాత్రి – సద్గురు