Ishan Kishan IPL : రూ. 15.25 కోట్ల ధర పలికిన ఇషాన్ కిషాన్
రూ. 12.25 కోట్లకు చేజిక్కించుకున్న కేకేఆర్
Ishan Kishan IPL : బెంగళూరు వేదికగా వేలం పాట ప్రారంభమైంది. ఊహించని రీతిలో శ్రేయాస్ అయ్యర్ తక్కువ ధర పలికితే అనుకోని రీతిలో ఇషాన్ కిషన్(Ishan Kishan IPL) కు ఎక్కువ ధర లభించింది. ఇది క్రీడాభిమానులను విస్తు పోయేలా చేసింది.
ప్రస్తుతం చారు శర్మ ఆధ్వర్యంలో ఐపీఎల్ వేలం పాట జరుగుతోంది. ఇషాన్ కిషన్ ను రూ. 15.25 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ . శ్రేయస్ అయ్యర్ ను కేకేఆర్ దక్కించుకుంది.
శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగాను రూ. 10.75 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ఖాతాలో వేసుకుంది. అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ రెండో రౌండ్ ను షిమ్రోన్ హెట్మెయర్ , దేవదత్ పడిక్కల్ ను తీసుకుంది.
హర్షల్ పటేల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఇషాన్ కిసన్ (Ishan Kishan IPL)తర్వాత అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. అతడు రూ. 12.25 కోట్లకు తీసుకుంది కేకేఆర్.
డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంటే షమీని లక్నో తీసుకుంది. డుప్లెసిస్ ను రూ. 7 కోట్లకు ఆర్సీబీ తీసుకుంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ కొత్తగా వేలం పాటలో పాల్గొన్నాయి.
ముంబై ఇండియన్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్ , పంజాబ్ కింగ్స్ , రాజస్తాన్ రాయల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఉన్నాయి.
ఇదిలా ఉండగా భారీ ధరకు కనీసం రూ. 20 కోట్లకు అమ్ముడు పోతాడని అంతా భావించారు అయ్యర్ ను. కానీ ఇషాన్ కిషన్ టాప్ లో నిలవడం ఆశ్చర్య పోయేలా చేసింది.
Also Read : ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ హవా