Ishan Kishan MI : ఇషాన్ కిషన్ సెన్సేషన్
చితక్కొట్టిన ముంబై బ్యాటర్
Ishan Kishan MI : ముంబై వేదికగా కోల్ కతాతో జరిగిన కీలక మ్యాచ్ లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan Kishan MI). ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇంకా 14 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై గత ఐపీఎల్ లో నిరాశ పరిచింది. ఈసారి మొదటి రెండు మ్యాచ్ లలో తడబడినా ఆ తర్వాత తేరుకుంది.
ఇక వరుసగా నాలుగుసార్లు డకౌట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సూర్య కుమార్ యాదవ్ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓ వైపు కెప్టెన్ రోహిత్ శర్మ , ఇషాన్ కలిసి 65 పరుగులు జోడించారు. ఇక ఈ మ్యాచ్ లో స్టార్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఈ మ్యాచ్ లో ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు.
జట్టుకు సూర్య కుమార్ యాదవ్ స్కిప్పర్ గా వ్యవహరించాడు. ఇక కోల్ కతా జట్టులో శివమెత్తాడు వెంకటేశ్ అయ్యర్. 51 బంతులు ఎదుర్కొని 9 సిక్సర్లు బాదాడు. 104 రన్స్ చేశాడు. రింకూ సింగ్ 18 రన్స్ చేశాడు. ముంబై జట్టులో రోహిత్ శర్మ 20 రన్స్ వద్ద ఔట్ కాగా ఇషాన్ కిషన్ 6 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 25 బంతులు ఎదుర్కొని 58 రన్స్ చేశాడు. వరుణ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. తిలక్ వర్మ 30 రన్స్ చేస్తే సూర్య కుమార్ యాదవ్ 43 పరగులతో సత్తా చాటాడు.
Also Read : కోల్ కతాకు షాక్ ముంబై ఝలక్