Ishitha Kishore Topper : సివిల్ టాపర్ ఫుట్ బాల్ ప్లేయర్
చరిత్ర సృష్టించిన ఇషితా కిషోర్
Ishitha Kishore Topper : దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత పొందిన సివిల్ సర్వీసెస్ ఫలితాలు వెల్లడయ్యాయి. దేశంలోనే టాపర్ గా నిలిచారు ఇషితా కిషోర్(Ishitha Kishore). ఆమె జాతీయ స్థాయి ఫుట్ బాల్ ప్లేయర్ గా గుర్తింపు పొందారు. గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు. పొలిటికల్ సైన్స్ , అంతర్జాతీయ సంబంధాలను ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారు. యూపీఎస్సీ పరీక్షకు అర్హత సాధించారు.
ఇషితా కిషోర్ ఢిల్లీ యూనివర్శిటీ లోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎకనామిక్స్ (ఆనర్స్ )లో పట్టభద్రురాలైంది. జాతీయ స్థాయిలో క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. ఆమె తండ్రి ఎయిర్ ఫోర్స్ అధికారి కూతురు. ఈ సందర్బంగా ఇషితా కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత స్పందించింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రథమ ర్యాంక్ సాధించడం తనకు ఒక కల లాంటిదని , ఐఏఎస్ అధికారి అయ్యాక మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని చెప్పారు.
ఇదిలా ఉండగా 26 ఏళ్ల వయసు కలిగిన ఇషితా కిషోర్ తన మూడవ ప్రయత్నంలో ప్రతిష్టాత్మక పరీక్షలో ఉత్తీర్ణత పరీక్షించింది. ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదన్నారు. ఇది నాకు ఒక కల . అది నిజమైనందుకు ఆనందంగా ఉందన్నారు సివిల్స్ టాపర్. తనను నిరంతరం ప్రోత్సహిస్తున్న తన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రోజుకు 9 గంటల పాటు చదువుకుంది. తల్లి ప్రైవేట్ పాఠశాలలో బోధన చేస్తారు. సోదరుడు న్యాయవాదిగా పని చేస్తున్నాడు. 2012లో సుబ్రోటో కప్ ఫుట్ బాల్ టోర్నీలో పాల్గొన్నారు.
Also Read : Modi Rahul Top