Israel PM : తీవ్ర ఉద్రిక్తత సమయంలో సంచలన ప్రకటన చేసిన బెంజమాన్

కాగా తమ సీనియర్ కమాండర్‌ను చంపినందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడుల చేస్తామని హిజ్బుల్లా ప్రకటించింది...

Israel PM : లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి హిజ్బుల్లా సైన్యానికి చెందిన వందలాది రాకెట్ లాంఛర్లను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమాన్ నెతన్యాహు(Israel PM) కీలక ప్రకటన విడుదల చేసింది. తనను తాను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. ‘‘ మా దేశాన్ని రక్షించుకునేందుకు, దేశ ఉత్తరాది ప్రజలను తిరిగి సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు సాధ్యమైనవన్నీ చేయాలని నిశ్చయించుకున్నాం. మాకు ఎవరైనా హాని కలిగిస్తే.. వారికి మేం హాని చేస్తాం.. ఈ సాధారణ నియమాన్ని పాటిస్తూ ముందుకు సాగుతాం’’ అని బెంజిమాన్ నెతన్యాహూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Israel PM Comment

కాగా తమ సీనియర్ కమాండర్‌ను చంపినందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడుల చేస్తామని హిజ్బుల్లా ప్రకటించింది. ఈ మేరకు సన్నద్ధమవుతున్న విషయాన్ని పసిగట్టిన ఇజ్రాయెల్‌.. ఆత్మరక్షణ కోసం ముందస్తు చర్యగా హిజ్బుల్లాకు చెందిన వందలాది రాకెట్లు, డ్రోన్‌లను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన 100కిపైగా ఫైటర్ జెట్లు లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి ఈ దాడులు జరిపాయి. కాగా లెబనాన్‌‌లోని హిజ్బుల్లా రాకెట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌ ఈ దాడులకు ఆమోదం తెలపడంతో దళాలు రంగంలోకి దాయి. కాగా దాడి విషయాన్ని ఇజ్రాయెల్, హిజ్బుల్లా ప్రకటనల ద్వారా నిర్ధారించాయి. కూడా చేశాయి.

Also Read : Pinnelli Ramakrishna Reddy: జైలు నుండి విడుదలైన వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి !

Leave A Reply

Your Email Id will not be published!