Isudan Gadhvi : ఆప్ గుజ‌రాత్ సీఎం అభ్య‌ర్థిగా ఇసుదాన్ గాధ్వీ

ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ డిక్లేర్

Isudan Gadhvi : గుజ‌రాత్ లో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. ఈసారి అధికారంలో ఉన్న బీజేపీతో పాటు కాంగ్రెస్ , ఆప్ పోటీ ప‌డుతున్నాయి. ఈ త‌రుణంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. త‌మ‌కు ఒక్క చాన్స్ ఇవ్వండంటూ ఆయ‌న కోరుతున్నారు.

ఇందులో భాగంగా ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు పిలుపునిచ్చారు. పంజాబ్ లో ఏర్పాటు చేసిన విధంగానే గుజ‌రాత్ లో కూడా ప్ర‌జ‌లు ఎవ‌రు సీఎంగా ఉండాల‌ని కోరుకుంటున్నారో బ‌హిరంగ పోల్ చేప‌ట్టారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ గుజ‌రాత్ ఆప్ సీఎం అభ్య‌ర్థిగా ఇసుదాన్ గాద్వీని(Isudan Gadhvi) ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో వ‌చ్చే నెల డిసెంబర్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 1, 5వ తేదీల‌లో రెండు విడ‌తులుగా పోలింగ్ జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 8న ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తుంది ఈసీ. ఈ మేర‌కు త‌మ పార్టీ అభ్య‌ర్థి త‌ర‌పున ఇసుదాన్ గాద్వీని ఎంపిక చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

అర‌వింద్ కేజ్రీవాల్ అహ్మ‌దాబాద్ లో మీడియాతో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 27 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీ ప్ర‌భుత్వం ఒక్క మంచి ప‌ని ఏం చేసిందో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు కేజ్రీవాల్. దేశాన్ని ఏలిన కాంగ్రెస్ , ఏళుతున్న బీజేపీ ప్ర‌జ‌ల‌కు ఒర‌గ‌బెట్టింది ఏమీ లేద‌న్నారు.

ఇక సీఎం రేసులో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు గోపాల్ ఇటాలియా, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌నోజ్ సోర‌తిహ్యా ఉన్నారు. కానీ చివ‌ర‌కు ఇసుదాన్ గాద్వీ నిలిచారు.

Also Read : రైతుల‌కు అండ‌గా పంజాబ్ ప్ర‌భుత్వం 

Leave A Reply

Your Email Id will not be published!