Ramiz Raja Predicts Team India : స్వ‌దేశంలో భార‌త్ ను ఓడించ‌డం కష్టం

పీసీబీ మాజీ చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా కామెంట్స్

Ramiz Raja Predicts Team India : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మ‌న్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ ర‌మీజ్ ర‌జా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఈసారి భార‌త జ‌ట్టును ఆకాశానికి ఎత్తేశాడు. ఎందుకంటే ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా టూర్ కొన‌సాగుతోంది ఇండియాలో. ఇప్ప‌టికే నాలుగు టెస్టుల సీరీస్ లో 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది టీమిండియా.

నాగ్ పూర్ లో జ‌రిగిన తొలి టెస్టులో, ఢిల్లీలో జ‌రిగిన 2వ టెస్టులో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది భార‌త్. ఈ త‌రుణంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ర‌మీజ్ ర‌జా. మంగ‌ళ‌వారం త‌న స్వంత యూట్యూబ్ ఛాన‌ల్ వేదిక‌గా భార‌త జ‌ట్టు(Ramiz Raja Predicts Team India) గెలుపొంద‌డంపై స్పందించాడు. ఏ జ‌ట్టు అయినా స‌రే టీమిండియాను భార‌త్ లో ఓడించ‌డం క‌ష్ట‌మ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. ఎందుకంటే వాళ్ల‌కు బ‌ల‌మైన స్పిన్ నెట్ వ‌ర్క్ ఉంద‌న్నారు.

 ఒక‌రు రాణించ‌క పోయినా మ‌రొక‌రు స‌త్తా చాటుతార‌ని ప్ర‌శంసించాడు. ప్ర‌స్తుతం టీమిండియా అత్యంత బ‌ల‌మైన జ‌ట్టుగా మారింద‌ని పేర్కొన్నాడు ర‌మీజ్ ర‌జా. విచిత్రం ఏమిటంటే స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కోవ‌డంలో ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు అంతగా ఫోక‌స్ పెట్ట‌లేద‌ని పేర్కొన్నాడు. దీని వ‌ల్ల వాళ్లు ర‌న్స్ చేసేందుకు నానా ఇబ్బంది ప‌డ్డార‌ని అన్నాడు ర‌మీజ్ ర‌జా. 

ఈ సంద‌ర్భంగా స్పిన్ ద్వ‌యం ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ లు అద్భుతంగా బౌలింగ్ చేశారంటూ కొనియాడాడు. వీరితో పాటు అక్ష‌ర్ ప‌టేల్ ఆడిన తీరు , చేసిన ఆ 74 ర‌న్స్ జ‌ట్టు గెలుపున‌కు దోహ‌ద ప‌డ్డాయ‌ని తెలిపాడు ర‌మీజ్ ర‌జా.

Also Read : స్మృతీ మంధాన మార‌థాన్ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!