Priyank Kharge : కాషాయ నేతలపై పరువు నష్టం కేసు
కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే
Priyank Kharge : కర్ణాటకలో పవర్ మారడంతో మాటల యుద్దానికి తెర పడింది. ఇప్పుడు కేసుల దాకా వెళ్లింది. నిన్నటి దాకా బొమ్మై సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఉండేది. కానీ సీన్ మారింది. ప్రస్తుతం సీఎం సిద్దరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. గతంలో బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను ఒక్కటొక్కటిగా రివ్యూ చేస్తున్నారు సీఎం. అంతే కాదు కీలక నిర్ణయాలు తీసుకుంటూ గుబులు రేపుతున్నారు.
తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్ర నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే(Priyank Kharge). బీజేపీ తయారు చేసి షేర్ చేసిన వీడియోపై మండిపడ్డారు. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా, అమిత్ మాల్వియాతో సహా పలువురు నేతలపై పరువు నష్టం కేసు వేశారు ప్రియాంక్ ఖర్గే. పదే పదే రాహుల్ గాంధీని విమర్శలకు గురి చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. దేశాన్ని , వనరులను గంప గుత్తగా ఇతరులకు కట్టబెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న మోదీ, బీజేపీ సర్కార్ కు రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు ప్రియాంక్ ఖర్గే.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు సంబంధించిన ఖర్చు ఎవరు భరించారో, ఎంతైందో, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మొత్తంగా ఈ పరువు నష్టం కేసు ఎంత దాకా వెళుతుందనేది వేచి చూడాలి.
Also Read : Sanjay Raut Shinde : ప్రపంచ ద్రోహుల దినంగా ప్రకటించాలి