Virender Sehwag : టీమిండియా గెలవడం కష్టం – సెహ్వాగ్
సంచలన కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్
Virender Sehwag : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా, మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
భారత జట్టు గెలవడం కష్టమని స్పష్టం చేశారు భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. పాకిస్తాన్ ,ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా, భారత్ తప్పనిసరిగా సెమీ ఫైనల్ కు చేరుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు సచిన్ టెండూల్కర్.
ఇదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) . ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే భారత జట్టు గెలవడం కష్టమేనని పేర్కొన్నారు. టోర్నీలో భాగంగా దాయాదులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 23న కీలక మ్యాచ్ జరగనుంది. ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరగడం ఖాయం. ఇరు జట్లు బౌలింగ్, బ్యాటింగ్ లో బలంగా ఉన్నాయి. టాస్ కీలకం కానుంది. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ -2022 లో దాయాదులు తలపడ్డాయి. రెండు మ్యాచ్ లు ఆడితే భారత్, పాకిస్తాన్ ఒక్కో మ్యాచ్ గెలుపొందాయి. పాకిస్తాన్ ఫైనల్ కు చేరితే భారత్ సత్తా చాటకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ తరుణంలో మెగా టోర్నీలో అంతా హాట్ ఫెవరేట్ భారత్ ను ప్రస్తావిస్తే వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం టీమిండియాకు అంత సీన్ లేదంటున్నాడు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్బుతంగా రాణించడం ఇండియాకు కష్టమేనని పేర్కొన్నాడు.
Also Read : టీమిండియా సెమీస్ కు చేరడం కష్టం