Amber Heard : ఇది ఊహించని దెబ్బ – అంబర్ హియర్డ్
జానీ డెప్ పరువు నష్టం కేసు తీర్పుపై
Amber Heard : యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన హాలీవుడ్ దిగ్గజ నటుల మధ్య జరిగిన పరువు నష్టం దావా కేసుకు తెర దించింది అమెరికాలోని వర్జీనియా జ్యూరీ.
ఈ మేరకు కోట్లాది ప్రజల ఆరాధ్య దైవంగా భావించే అరుదైన నటుడు జానీ డెప్ పై ఆయన మాజీ భార్య అంబర్ హియర్డ్(Amber Heard) పరువు నష్టం చెల్లించాలంటూ కోర్టుకు ఎక్కింది. గత కొంత కాలంగా ఈ కేసు విచారణ నడుస్తూ వచ్చింది.
చివరకు ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ (ధర్మాసనం) సంచలన తీర్పు చెప్పింది. $15 మిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా జానీ డెప్ కు చెల్లించాలంటూ మాజీ భార్య, ప్రముఖ నటి అంబర్ హియర్డ్ ను ఆదేశించింది.
ఒక రకంగా చెప్పాలంటే కోలుకోలేని షాక్ ఇచ్చింది. కోర్టు కీలక తీర్పు వెలువడిన వెంటనే ఈ ఇద్దరు హాలీవుడ్ స్టార్స్ స్పందించారు. జ్యూరీ వెలువరించిన తీర్పు తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిందని జానీ డెప్ చెప్పారు.
కాగా కేసు ఓడ పోయిన నటి , మాజీ భార్య అంబర్ హియర్డ్(Amber Heard) మాత్రం తీవ్ర నిరాశకు గురి చేసిందని వాపోయింది. ఫెయిర్ ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తీర్పు వెలువరిస్తున్న సమయంలో తల దించుకుని ఉన్నారు.
ఈరోజు నేను అనుభవిస్తున్న నిరాశ పదాలకు అతీతమైనదని పేర్కొంది అంబర్ హియర్డ్. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
నా మాజీ భర్త తన అసమానమైన శక్తి, ప్రభావం , ఊపును ఎదుర్కొనేందుకు ఇప్పటికీ సాక్ష్యాల పర్వతం సరి పోలేదని నేను నమ్ముతున్నానని చెప్పారు అంబర్ హియర్డ్.
Also Read : పరువు నష్టం కేసులో జానీ డెప్ గెలుపు